Allu Ayan And Anna Lezhneva: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star allu Arjun) సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish) నిశ్చితార్థం నిన్న హైదరాబాద్ లోని తన నివాసం లో బంధు మిత్రుల సమక్ష్యం లో గ్రాండ్ గా జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకని ముందుగా అయన అవుట్ డోర్ లో చేద్దామని అనుకున్నాడు కానీ, తుఫాన్ కారణంగా హైదరాబాద్ మొత్తం విస్తారంగా వర్షాలు పడడం, ఈదురు గాలులు వీయడం తో మండపం మొత్తం పాడైపోయింది. దీంతో ఆయన తన ఇంటి లోపలే నిశ్చితార్థం చేసుకున్నాడు. నైనికా అనే అమ్మాయితో గత కొంతకాలం నుండి ప్రేమలో ఉన్న అల్లు శిరీష్, ఎట్టకేలకు ఇప్పుడు ఆమెని పెళ్లాడబోతున్నాడు. ఈయన వివాహం వచ్చే ఏడాది ప్రారంభం లో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ పెళ్ళికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇలా ప్రతీ ఒక్కరు ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఒక్క పవన్ కళ్యాణ్ మినహా. రాజకీయ కార్యక్రమాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంగళగిరి లో ఫుల్ బిజీ గా ఉండడం తో ఆయన ఈ నిశ్చితార్ధ వేడుకకు రాలేకపోయాడు. ఆయనకు బదులుగా సతీమణి అన్నా లెజినోవా వచ్చింది. ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తో మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడే కాదు, గతం లో అల్లు అర్జున్ నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా అల్లు అయాన్ అన్నా లెజినోవా తో క్లోజ్ గా మాట్లాడుతూ ఉండడాన్ని అందరూ గమనించారు. చూస్తుంటే వీళ్లిద్దరి మధ్య మంచి ర్యాపో సెట్ అయినట్టు అనిపిస్తుంది.
నిశ్చితార్థం వేడుక అయిపోయిన తర్వాత అన్నా లెజినోవా బయటకు వచ్చి తన కారు కోసం ఎదురు చూస్తున్న సమయం లో అల్లు అయాన్ ఆమె వద్దకు వచ్చి ఎదో మాట్లాడుతూ ఉంటాడు. ఏమి మాట్లాడాడు అనేది ఎవరికీ తెలియదు కానీ, వీళ్ళ మధ్య జరిగిన ఆ సంభాషణకు సోషల్ మీడియా లో మీమర్స్ తమ క్రియేటివిటీ తో రకరకాలుగా వీడియోలు తయారు చేసి అప్లోడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
#AnnaLezhneva at @AlluSirish Engagement!! pic.twitter.com/E7IKfh3qat
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) November 1, 2025