https://oktelugu.com/

Sita Ramam: ‘సీతారామం’ సినిమాని మన టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలు వదులుకున్నారో తెలుసా

Sita Ramam: ఇటీవల కాలం లో బాక్స్ ఆఫీస్ పరంగా సంచలనం సృష్టించిన సినిమాలలో ఒకటి సీతారామం..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మండన ముఖ్య పాత్ర పోషించింది..మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే పాతిక కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటేసింది..కొత్త సినిమాలు వచ్చినప్పటికీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2022 / 02:31 PM IST
    Follow us on

    Sita Ramam: ఇటీవల కాలం లో బాక్స్ ఆఫీస్ పరంగా సంచలనం సృష్టించిన సినిమాలలో ఒకటి సీతారామం..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మండన ముఖ్య పాత్ర పోషించింది..మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే పాతిక కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటేసింది..కొత్త సినిమాలు వచ్చినప్పటికీ కూడా సీతారామన్ ఊపు ఏ మాత్రం తగ్గలేదు..ఫుల్ రన్ లో మరో 5 కోట్ల రూపాయిలు వసూలు చేసి 30 కోట్ల రూపాయిల షేర్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి కి ఈ చిత్రానికి ముందు అన్ని ఫ్లాపులే ఉన్నాయి..ఆయన తీసిన ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’, ‘అందాల రాక్షసి’ వంటి సినిమాలు ఒక్కటే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి..ఆ తర్వాత వచ్చిన లై , పడిపడి లేచే మనసు వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన ఫ్లాప్స్ గా నిలిచాయి.

    Sita Ramam

     

    దీనితో హను రాఘవపూడి తో సినిమాలు చెయ్యడానికి మన క్రేజీ హీరోలెవరు కూడా ఆసక్తి చూపించలేదు..వాస్తవానికి సీత రామం సినిమా ని తొలుత మన టాలీవుడ్ హీరోలతో తీద్దాం అనుకున్నాడట హను..ఇందుకోసం న్యాచురల్ స్టార్ నాని మరియు రామ్ పోతినేని వంటి హీరోలతో చర్చలు కూడా జరిపారట..అయితే డేట్స్ సర్దుబాటు కాలేకనో లేకపోతే కెరీర్ మంచి ఊపు లో వెళ్తున్న సమయం లో ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేసి రిస్క్ చెయ్యడం ఎందుకనో తెలీదు కానీ వీళ్లిద్దరు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు..ఆ తర్వాత కూడా హను చాలా మంది హీరోలనే కలిసాడు..కానీ ఎవ్వరు కూడా ఈ సినిమా ఆసక్తి చూపించలేదు.

    Also Read: Oscars 2023 RRR : ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ కు కశ్మీర్ ఫైల్స్ గట్టి పోటీ!

    Sita Ramam

    ఇక ఈ సినిమాలో సీత పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కోసం ప్రయత్నం చేసాడు హను..కానీ ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు..ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ కి ఈ కథ చెప్పగానే వెంటనే నచ్చి ఓకే చేసేసాడు..అలా తెరకెక్కిన సీతారామం సినిమా ఈరోజు టాలీవుడ్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..తెలుగు లో దుల్కర్ సల్మాన్ కి మంచి మార్కెట్ ని మరియు క్రేజ్ ని తెచ్చిపెట్టింది ఈ సినిమా..ఈ చిత్రం తర్వాత తెలుగు లో దుల్కర్ సల్మాన్ రాబొయ్యే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఒకవేళ ఈ సినిమా లో నాని లేదా రామ్ వంటి హీరోలు నటించి ఉంటె వాళ్ళ కెరీర్ ని ఈ సినిమా మరో లెవెల్ కి తీసుకెళ్లి ఉండేదేమో బాడ్ లక్.

    Also Read:Jabardast comedian: జబర్దస్త్ కమెడియన్ ఇంట విషాదం

    Tags