Telugu Anchors Remuneration: ఒక సినిమాకు హీరోయిన్ ఎంత అందాన్నిస్తుందో.. ఓ సినీ ఫంక్షన్లో కూడా యాంకర్ అంతే స్థాయిలో ఆకట్టుకుంటుంది. ఈవెంట్ సక్సెస్ కావడంలో యాంకర్ కీలక పాత్ర పోషిస్తారు. అందమైన మాటలతో నవ్వులు పూయిస్తూ అందరి మన్ననలు పొందే యాంకర్లు తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఒక్కసారి యాంకర్ గా అవకాశం వస్తే చాలా మంది తమ ప్రతిభను చూపించి స్టార్లు అయ్యారు. వీరిలో సుమ, శ్యామలతో పాటు ప్రదీప్ లాంటి మేల్ యాంకర్స్ కూడా ఉన్నారు. వీరు సినిమాల్లో పెద్దగా నటించకపోయినా యాంకరింగ్ ద్వారానే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. దీంతో వీరు స్టార్ నటుల లాగే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఒక్కో ఈవెంట్ కు కోట్ల రూపాయలు తీసుకుంటూ షాక్ ఇస్తున్నారు. ఇంతకీ ఏ యాంకర్ ఎంత తీసుకుంటున్నారో చూద్దాం.

సుమ కనకాల:
సీరియల్ ద్వారా టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమ కనకాల ఇప్పుడు స్టార్ యాంకర్. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె ఈ రంగంలో రాణిస్తున్నారు. టీవీ షోల్లో స్టార్ ఇమేజ్ తెచ్చుకొని ఆ తరువాత సినీ ఈవెంట్స్ లో అవకాశాలు తెచ్చుకున్నారు. ప్రతీ ఈవెంట్ కు ఎందరో నటీనటులు వస్తారు. వీరిని అలరించడానికి సుమ తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటుంది. ఇలా ఒక్కో ఈవెంట్ చేసినందుకు రూ.3.5 నుంచి 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.
అనసూయ:
జబర్దస్త్ అనే టీవీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఆ తరువాత సినిమాల్లోనూ నటిస్తూ స్టార్ నటిగా పాపులర్ అయింది. అయితే అవకాశం వచ్చినప్పుడు సినీ ఈవెంట్లలోనూ అలరిస్తోంది. అందచందాలను ఆరబోస్తూ తన ముద్దు మాటలతో ఆకట్టుకుంటుంది అనసూయ. ఒక ఫంక్షన్లో అనసూయ ఉందంటే కొందరు హీరోలు ఫుల్ ఖుషీ అవుతారట. అంతటి ఇమేజ్ అనసూయ సొంతం. ఈనేపథ్యంలో ఆమె ఒక్కో ఈవెంట్ కు రూ.2 లక్షలు వసూలు చేస్తుందట.
ప్రదీప్ మాచిరాజు:
యాంకర్ గా ఫీమేల్ గానే కాకుండా మేల్స్ కూడా అలరిస్తారు అని నిరూపించాడు ప్రదీప్ మాచిరాజు. చిన్న ప్రోగ్రామ్స్ ద్వారా టీవీ ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రాజు సినిమా హీరో వరకు ఎదిగారు. కానీ సినిమాల్లో కంటే యాంకరింగ్ గానే ఆయనకు ఎక్కువగా గుర్తింపు ఉంది. దీంతో ప్రదీప్ ఒక్కో షో చేసినందుకు రూ.లక్ష వరకు చార్జ్ చేస్తారట.

రష్మీ గౌతమ్:
ఈ భామ కూడా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయింది. అయితే కేవలం యాంకర్ గానే కాకుండా డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తే ప్రోగ్రామ్ కే అందం వస్తుందని కొందరు కుర్రకారు అంటూంటారు. ఈ నేపథ్యంలో రష్మీకి స్టార్ డమ్ దక్కింది. దీంతో ఈ భామ ఒక్కో షో కు రూ.1.5 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు తీసుకుంటుందట.
శ్రీముఖి:
‘పటాస్’ అనే ప్రోగ్రాం ద్వారా టీవీ రంగం లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి కూడా పలు సినిమాల్లో నటించింది. ఆ మధ్య బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయింది. అయితే యాంకర్ గానే శ్రీముఖి ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక్కో షో చేసినందుకు రూ.లక్షల రూపాయలు ఇస్తారట.
రవి:
సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ డైలాగ్స్ తో ఆకట్టుకునే యాంకర్ రవి. తనదైన స్లాగ్ తో కుర్రాళ్ళ అభిమాన యాంకర్ గా మారిపోయాడు. రవి అంతకుముందే యాంకర్ గా ఫేమస్ అయ్యాడు. కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. ఆ తరువాత ‘పటాస్’ తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఒక్కో షో చేసినందుకు రవికి రూ.70 వేల పారితోషికం ఇస్తారు.
మంజూష:
‘రాఖీ’ సినిమా ద్వారా ఫేమస్ అయిన మంజూష ఆ తరువాత యాంకర్ గా జీవితాన్ని మొదలుపెట్టారు. దీంతో ఆమెకు ఈ రంగం కలిసొచ్చింది. తనదైన వాక్చాతుర్యంతో ఆకట్టుకొని స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. మంజూష ఒక్కో షో కు రూ.50 వేలు వసూలు చేస్తుంది.
శ్యామల:
సీరియళ్ల ద్వారా టీవీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన శ్యామల ఆ తరువాత యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం యాంకర్ గానే కాకుండా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమె ఒక్కో షో చేసినందుకు రూ.50 వేలు చార్జ్ చేస్తుందట.