spot_img
Homeఎంటర్టైన్మెంట్Happy Birthday Rajinikanth: లగ్జరీ కార్లు, విలాసవంతమైన బంగ్లాలు... రజినీకాంత్ కి ఎన్ని వందల కోట్ల...

Happy Birthday Rajinikanth: లగ్జరీ కార్లు, విలాసవంతమైన బంగ్లాలు… రజినీకాంత్ కి ఎన్ని వందల కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Happy Birthday Rajinikanth: నేడు రజినీకాంత్ బర్త్ డే. 1950 డిసెంబర్ 12న జన్మించిన రజినీకాంత్ నేడు 73వ ఏట అడుగుపెట్టారు. వరల్డ్ వైడ్ ఆయన అభిమానులు రజినీకాంత్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఏడు పదుల వయసులో కూడా రజినీకాంత్ వరుస చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రజినీకాంత్ 168 చిత్రాలు చేశారు. మరో మూడు సినిమాలు లైన్లో పెట్టారు. రజినీకాంత్ ఇండియాలోనే అతిపెద్ద హీరో. ఒక్కో సినిమాకు వంద కోట్లు తీసుకుంటారు. తన సంపాదనలో రజినీకాంత్ యాభై శాతం వరకు ఛారిటీకి ఖర్చు చేస్తారు.

అయినా కూడా రజినీకాంత్ వందల కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు. రజినీకాంత్ ఆస్తుల వివరాలు పరిశీలిస్తే… ఆయనకు చెన్నై నగరంలోని పోయెస్ గార్డెన్ ఏరియాలో బంగ్లా ఉంది. అక్కడే రజినీకాంత్ నివాసం ఉంటున్నారు. 2002లో ఈ ఇంటిని నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లా ధర రూ. 35 కోట్లు అని అంచనా. అలాగే రజినీకాంత్ కి రాఘవేంద్ర మండపం అనే ఫంక్షన్ హాల్ ఉంది. ఈ ప్రాపర్టీ ధర రూ. 20 కోట్లని అంచనా.

రజినీకాంత్ కార్ గ్యారేజ్ లో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. రూ. 6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ హోస్ట్, రూ.16 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ రజినీకాంత్ వద్ద ఉన్నాయి. అలాగే హోండా సివిక్, ప్రీమియర్ పద్మిని, టయోటా ఇన్నోవా కార్లు రజినీకాంత్ వివిధ సందర్భాల్లో కొన్నారు. జైలర్ మూవీ నిర్మాత ఇటీవల ఆయనకు ఓ లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారు.

వీటితో పాటు రూ.1.77 కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ X 5, రూ.2.55 కోట్ల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ జి వ్యాగన్, 3.10 కోట్ల విలువైన లాంబోర్గిని కార్లు రజినీకాంత్ వద్ద ఉన్నాయి. బెంట్లీ లిమోసిన్ ని కూడా రజనీకాంత్ వద్ద ఉంది. దీని ధర రూ .6 కోట్లు కాగా రజినీకాంత్ అభిరుచికి తగ్గట్లు దాన్ని డిజైన్ చేశారట. ఆ కారణంగా ఆ కారు ధర రూ.22 కోట్లు అట. మొత్తంగా రజినీకాంత్ ఆస్తుల విలువ రూ. 430 కోట్లు అని ఒక అంచనా.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
Oktelugu Epaper
Exit mobile version