తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఎల్లలు దాటి ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. నిజానికి పుష్ప 2 సినిమాతో ఇప్పుడు భారతదేశమంతట తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. నిజానికి మన ఇండస్ట్రీ ఒకప్పుడు మిగతా ఇండస్ట్రీ లతో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉండేది. కానీ ఒక్కసారిగా మనవాళ్ళు భారీ విజయాలను సాధిస్తూ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు వరుస విజయాలను అందుకుంటూ 1000 కోట్ల కలెక్షన్లను చాలా ఈజీగా రాబడుతున్నారు. అల్లు అర్జున్ కూడా భారీ విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటి వరకు పుష్ప 2 సినిమాకి 1800 కోట్ల కలెక్షన్ల వచ్చాయి. ఇక ఈ సినిమా తొందర్లోనే 2000 కోట్ల మార్క్ ను దాటబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా చాలా మంచి హైప్ ఉంది. మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో రెండోవ పార్ట్ మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. దాంతో చాలా రకాల బ్రాండ్స్ కూడా ఈ సినిమాకి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఆసక్తి చూపించాయి.అందుకే టైటిల్ సాంగ్ లో పుష్ప తాగే టీ గ్లాస్ పైన ‘చక్ర గోల్డ్ టీ’ అనే బ్రాండ్ కనిపిస్తోంది.
ఇక ఆ తర్వాత చిన్నాన్నా అనుకుంటూ పుష్పరాజు వాళ్ళ అన్నయ్య కూతురు చైన్ తీసుకెళ్లేటప్పుడు వెనకాల ‘కళ్యాణ్ జువెలర్స్’ కనిపిస్తుంది. ఇక రెష్మిక కాలికి దెబ్బ తగిలినప్పుడు బ్యాక్ సైడ్ లో ‘దావత్ రైస్’ బ్యాగ్ కూడా కనిపిస్తుంది. పుష్ప ట్రావెల్స్ ఓపెన్ చేసినప్పుడు లారీ టైరు మీద ‘జెకె టైర్’ అనేది చాలా క్లోజ్ షాట్ లో మనకు కనిపిస్తుంది…ఇక పిల్లలు క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్ మీద ‘బ్రిటానియా ‘ అని ఉంటుంది. దాన్ని పుష్పరాజ్ పట్టుకొని వాళ్లకు ఇస్తాడు. ఇక పుష్ప కు సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నప్పుడు ‘అంబుజ సిమెంట్’ బ్రాండ్ మనకు కనిపిస్తుంది. అలాగే పీలింగ్స్ అనే సాంగ్ లో ‘అస్ట్రల్ ట్యాంక్’ మనకు కనిపిస్తుంది. ఇలా ఈ సినిమాను మొత్తం బ్రాండ్స్ తోనే నింపేశారు.
మొత్తానికైతే బ్రాండ్స్ ద్వారానే సినిమా యూనిట్ కి 50 కోట్ల వరకు డబ్బులు అయితే వచ్చాయి. ఇక ఇలా చేయడం ద్వారా వాళ్లు కూడా ఆ బ్రాండ్ కి కూడా ఎక్కువ ఆదరణ దక్కడానికి అవకాశం అయితే ఉంటుంది…ఇక దర్శకుడు అయిన సుకుమార్ కూడా ఆ బ్రాండ్స్ ని ఎక్కడెక్కడ వాడాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకొని వాటిని వాడినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ప్రొడ్యూసర్ కి ఇలా బ్రాండ్స్ రూపంలో కూడా డబ్బులు వస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు. మొత్తానికైతే పుష్ప 2 సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కింది. కాబట్టి ఇండియా వైడ్ గా తమ బ్రాండ్ కూడా హైలెట్ అవుతాయనే ఉద్దేశ్యం తోనే ఆయా కంపెనీలు తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకున్నాయనే చెప్పాలి…