Chiranjeevi Assets: శివ శంకర్ వరప్రసాద్ అనే ఓ సాధారణ యువకుడు వెండితెరను తిరుగులేకుండా ఏలుతాడని ఎవరూ ఊహించలేదు. ప్రతిభకు తోడు కృషి పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని చిరంజీవి నిరూపించాడు. వెండితెర రారాజు చిరంజీవి పుట్టినరోజు నేడు. 1955 ఆగస్టు 22న మొగల్తూరులో జన్మించిన చిరంజీవి 68వ ఏట అడుగుపెట్టాడు. నటుడు కావాలనే కోరికతో చెన్నై వెళ్లి ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో విలన్, సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. పున్నమినాగు, ఖైదీ వంటి చిత్రాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి.
ఎన్టీఆర్, ఏఎన్నార్ సిల్వర్ స్క్రీన్ ని దున్నేస్తున్న రోజుల్లో చిరంజీవి నేనున్నానంటూ తన మార్క్ క్రియేట్ చేశాడు. నంబర్ వన్ పొజీషన్ సొంతం చేసుకున్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చిరంజీవి ఒక దశలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా రికార్డులకు ఎక్కాడు. 1992లో చిరంజీవి అమితాబ్ కంటే అధికంగా కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
కొత్త జనరేషన్ స్టార్స్ గా ఎదిగినా చిరంజీవి మేనియా తగ్గలేదు. వాళ్లతో పోటీపడుతూ చిరంజీవి యాభై కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఒకప్రక్క సామాజిక సేవ చేస్తూనే చిరంజీవి వందల కోట్లను ఆర్జించారు. చిరంజీవి ఆస్తుల లెక్కలు వింటే మతిపోవాల్సిందే. చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన కార్ బ్రాండ్స్ లో ఒకటైన రోల్స్ రాయిస్ ప్యాంటమ్ ఉంది. దీని ధర అక్షరాలా రూ. 8 కోట్లు. చిరంజీవి గ్యారేజీలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్స్ ఉన్నాయి. ఒక్కో కార్ ధర కోటి రూపాయలకు పైనే. రేంజ్ రోవర్ తో పాటు బెంజ్, ఆడి కార్స్ ఆయన వద్ద ఉన్నాయి.
చిరంజీవి కొన్నేళ్ల క్రితం అత్యంత విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారు. దాదాపు రూ. 30 కోట్ల ఖర్చుతో ఆ ఇంటి నిర్మాణం జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానికి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థలు చిరంజీవి ఇంటిని ప్రత్యేకంగా నిర్మించాయి. చిరంజీవికి కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ ఉంది. మొత్తంగా చిరంజీవి ఆస్తుల విలువ రూ. 1650 కోట్లు అని ఒక అంచనా…