https://oktelugu.com/

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎన్ని సెంటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకోబోతుందో తెలుసా..!

కృష్ణ జిల్లాలో మొదటి నుండి మెగాస్టార్ చిరంజీవి కి తిరుగులేని క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.అప్పట్లో ఈ జిల్లాలో టాప్ 10 హైయెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో 8 సినిమాలు చిరంజీవివే ఉండేవి.ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' చిత్రం కూడా ఈ జిల్లాలోనే 175 రోజులను పూర్తి చేసుకోబోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : May 5, 2023 / 12:59 PM IST
    Follow us on

    Waltair Veerayya: ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో ఒక సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా రెండు మూడు వారాలకు మించి థియేటర్స్ లో ఆడని పరిస్థితి ఏర్పడింది. కానీ కొన్ని సినిమాలు మాత్రం రీసెంట్ టైం లో కమర్షియల్ గా కళ్ళు చెదిరే నంబర్స్ ని రాబట్టినప్పటికీ,50 రోజులు మరియు వంద రోజులకు పైగా థియేటర్స్ లో రన్ అవుతూ ఆశ్చర్యపరిచాయి.

    ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.సుమారుగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి, సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ సినిమా.ఈ సినిమా ఈమధ్యనే వంద రోజులను కొన్ని సెంటర్స్ లో పూర్తి చేసుకుంది.ఇప్పుడు 175 రోజులను కూడా త్వరలోనే పూర్తి చేసుకోబోతుంది.దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాము.

    కృష్ణ జిల్లాలో మొదటి నుండి మెగాస్టార్ చిరంజీవి కి తిరుగులేని క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.అప్పట్లో ఈ జిల్లాలో టాప్ 10 హైయెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో 8 సినిమాలు చిరంజీవివే ఉండేవి.ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కూడా ఈ జిల్లాలోనే 175 రోజులను పూర్తి చేసుకోబోతుంది.

    కృష్ణ జిల్లాలోని అవనిగడ్డ ప్రాంతం లో ఈ సినిమా 175 రోజులు ఆడబోతున్నట్టు సమాచారం. చిరంజీవి కెరీర్ లో మరో మైల్ స్టోన్ గా నిల్చిన ఈ చిత్రం ఇలా 100 రోజులు మరియు 175 రోజులు పూర్తి చేసుకోవడం మెగా అభిమానులను ఎంతో ఆనందానికి గురి చేసింది.వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కి ఈ ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఇచ్చిన కిక్ మామూలుది కాదు.మెగా ఫ్యాన్ తమ జ్ఞాపకాల్లో పదిలంగా పెట్టుకునే సినిమా ఇది.