Homeఎంటర్టైన్మెంట్Samantha Cars: సమంత ఎన్ని కార్లు వాడుతుందో తెలుసా?

Samantha Cars: సమంత ఎన్ని కార్లు వాడుతుందో తెలుసా?

Samantha Cars: మన తెలుగు సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్లకు భారీగా పారితోషికాలు ఉంటాయి. దీంతో వారు విలాసవంతమైన జీవితాలు గడుపుతుంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆస్తులు కూడటెట్టుకుంటారు. ఇదే కోవలో చాలా మంది తమ ఆస్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటారు. గతంలో ప్రముఖ నటిగా వెలుగొందిన శ్రీదేవి తన ఆస్తులను కూడబెట్టుకున్నా చివరి క్షణంలో మాత్రం నిలుపుకోలేకపోయింది. తన సోదరి అన్నింటిని లాగేసుకోవడంతో కష్టాల పాలైంది. కానీ ఇప్పుడున్న హీరోయిన్లు అలా కాదు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో ప్రముఖ నటిగా వెలుగొందుతున్న సమంత ఆస్తులు తెలిస్తే మతి పోవాల్సిందే. ఆమె సంపాదించిన ఆస్తులు చూస్తే వారెవ్వా అనిపిస్తుంది.

Samantha
Samantha cars

సమంత తెలుగు సినిమా పరిశ్రమకు ఏ మాయ చేశావె సినిమాతో రంగప్రవేశం చేసింది. తరువాత అగ్రహీరోలందరితో నటించి తన సత్తా నిరూపించుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తరువాత కాలంలో నాగార్జున కొడుకు నాగచైతన్యను వివాహం చేసుకుని వైవాహిక జీవితం గడిపింది. ఏమైందో ఏమో కానీ మధ్యలోనే విడాకులు ఇచ్చి ఇప్పుడు ఒంటరిగానే మిగిలిపోయింది కానీ తన ఆస్తులను మాత్రం రెట్టింపు చేసుకుంటోంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై లలో విల్లాలు, ప్లాట్లు కొనుగోలు చేసింది. రియల్ ఎస్టేట్ లోను పెట్టుబడులు పెడుతోంది. దీంతో ఆమె సంపాదన రూ.కోట్లలోనే ఉంటుందని తెలుస్తోంది.

Also Read: Marriage Vow: పెళ్లినాటి ప్రమాణాల్లో అంతటి శక్తి ఉందా?

ఇక ఆమె ఉపయోగించే కార్ల గురించి ప్రస్తావిస్తే ఆమె దగ్గర ఆరు కార్లు ఉన్నట్లు తెలిసిందే. ఒక్కో కారు విలువ తెలిస్తే షాకే. అంతటి భారీ ధరతో కొనుగోలు చేసింది. ఆమెకు ఎప్పుడు ఏ కార్లో వెళ్లాలనిపిస్తే ఆ కారులోనే వెళ్తారట. అంతటి దర్జా జీవితం ఎవరికి సొంతం ఒక్క సెలబ్రిటీలకు తప్ప. మధ్య తరగతి వారికి తిందామంటే తిండే దొరకదు. ఇక కార్లు ఎక్కడి నుంచి వస్తాయి? మొత్తానికి సమంత లైఫ్ దర్జాగానే సాగుతోంది. ఆమెకు అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. దీంతో ఆమె మరికొంత కాలం తెలుగు సినిమా రంగాన్ని ఏలుతారని తెలుస్తోంది.

Samantha cars
Samantha cars

సమంత తెలుు సినిమాకు దొరికిన ఆణిముత్యం. గోల్డెన్ లెగ్ గా పేరుతెచ్చుకున్న ఆమె నటించిన ఏ చిత్రమైనా బాక్సాఫీసు దగ్గర విజయం సాధించాల్సిందే. ఏ మాయ చేశావె నుంచి ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆమె పారితోషికం కూడా అదే రేంజ్ లో ఉంటోంది. అందుకే ఆమె ఆస్తులు కూడా పెరిగిపోతున్నాయి. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించి తానేమిటో నిరూపించుకుంటోంది. సమంత మరిన్ని హిట్లతో ఇంకా కొంత కాలం నెంబర్ వన్ స్థానం దక్కించుకుంటుందని సినీవర్గాల అంచనా.

ఇప్పటికి ఎందరో కొత్త హీరోయిన్లు వచ్చినా ఆమెతో పోటీ పడటం లేదు. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆమె ఒప్పుకుంటే ఏ సినిమా అయినా సక్సెసే అనే టాక్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆమె తన అదృష్టాన్ని ఇలాగే కొనసాగిస్తుందని ప్రేక్షకులు కోరుతున్నారు.

Also Read:Megastar Chiranjeevi Holiday Trip: ఒకపక్క మేము చనిపోతుంటే.. మీకు సరదాలు కావాలా చిరంజీవి ?

Recommended Videos

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular