Malaika Arora: గబ్బర్ సింగ్ ‘కెవ్వు కేక’ బ్యూటీ ఇప్పుడెలా ఉందో చూస్తే షాకవుతారు..

పవన్ కల్యాన్ కు వరుస హిట్లు వస్తున్న తరుణంలో హరీష్ శంకర్ డైరెక్సన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మరోసారి కెరీర్ మలుపుతిప్పింది. ఇది హిందీ దబాంగ్ మూవీకి రీమేక్ అయినా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది.

Written By: Chai Muchhata, Updated On : June 24, 2023 6:38 pm

Malaika Arora

Follow us on

Malaika Arora: ఇప్పుడొస్తున్న సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్ సందడి చేస్తున్నాయి. అవసరం లేకుండా యూత్ ను ఇంప్రెస్ చేసేందుకు ఐటెం సాంగ్స్ జోడిస్తున్నారు. ఈ ప్రత్యేక సాంగ్ లో ఒకప్పుడు స్పెషల్ గా నటీమణులు ఉండేవారు. మొదట్లో టాలీవుడ్ కు చెందిన వారు ఐటెం సాంగ్స్ చేయకపోవడంతో బాలీవుడ్ నుంచి దించేవారు. రాను రాను తెలుగు స్టార్ హీరోయిన్లు సైతం ఇలాంటి సాంగ్స్ లో నటిస్తు డ్యాన్స్ చేస్తున్నారు. అయితే ఐటెం సాంగ్స్ లో ఎక్కువగా పాపులర్ అయనవి ఉన్నాయి. వీటిల్లో కెవ్వు కేక ఒకటి. పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీలోని ఈ సాంగ్ లో మలైకా అరోరా నటించింది. ప్రస్తుతం ఈ హాట్ భామ ఎలా ఉందో తెలుసా?

పవన్ కల్యాన్ కు వరుస హిట్లు వస్తున్న తరుణంలో హరీష్ శంకర్ డైరెక్సన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మరోసారి కెరీర్ మలుపుతిప్పింది. ఇది హిందీ దబాంగ్ మూవీకి రీమేక్ అయినా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఒక దశలో పవన్ కల్యాణ్ యాక్టింగ్ తోనే ఈ సినిమా సక్సెస్ అయిందని అంటుంటారు. కథతో పాటు ఇందులో సాంగ్స్ హైలెట్ గా నిలిచారు. మిగతా పాటల కంటే ఐటెం సాంగ్ ‘కెవ్వె కేక’ కుర్రాళ్లలో జోష్ తెప్పించింది.

కెవ్వు కేక అనే ఈ సాంగ్ నటించింది మలైకా అరోరా. ఈమె తెలుగులో పెద్దగా పరిచయం లేకపోయినా హిందీలో బిగ్ స్టార్ నే. అప్పటికే ఆమె ఎన్నో ఐటెం సాంగ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కెవ్వు కేకతో పాపురల్ అయింది. ఇప్పటికే ఈ పాటలో మలైకాతో పాటు పవన్ కల్యాణ్ కూడా అదిరే స్టెప్పులు వేసి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఈ సాంగ్ నిలిచిపోయిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు.

ఇక మలైకా అరోరా కొన్ని రోజుల పాటు బీ టౌన్ లో తన హవా చూపించింది. ఆ తరువాత సల్మాన్ ఖాన్ తమ్ముడు ఫర్జానా ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు. ఈ క్రమంలో ఆమె అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. ప్రస్తుతం వీరిద్దరు హాయిగానే ఉంటున్నారు. అయితే మలైకా అరోరా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ తో దర్శనమిస్తోంది. తాజాగా ఆమె అప్డేట్ చేసిన ఫొటోలు యూత్ కు నిద్రలేకుండా చేస్తున్నాయి.