Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)…ఈయన చేసిన ప్రతి సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలపడంలో చాలావరకు ముందంజలో ఉన్నాడు. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మహేష్ బాబు (Mahesh Babu) లాంటి స్టార్ హీరోని పెట్టి పాన్ వరల్డ్ సినిమా తీసి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఈ సినిమా మీద కూడా ఇండియా వైడ్ గా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక జేమ్స్ కామెరూన్ (James Cameron) లాంటి హాలీవుడ్ డైరెక్టర్లు సైతం రాజమౌళిని ప్రశంసించడం చూసిన ప్రతి ఒక్కరూ రాజమౌళి అభిమానులుగా మారిపోయారు. ఇక ఇదిలా ఉంటే ప్రతి రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే ఆ సినిమా కోసం ఎదురుగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ‘జేమ్స్ కామెరూన్’ పక్కన ఒకడిగా నిలబడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి సినిమాలో ఇంట్రాడక్షన్ సీన్స్ చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రాడక్షన్ సీన్స్ చాలా కొత్తగా ఉండడమే కాకుండా వాటికి చాలా గుర్తింపు కూడా వచ్చింది.
ఇక అదే రీతిలో ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా అదిరిపోయేలా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మహేష్ బాబు ఒక ఫారెస్ట్ లో తన ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కొంతమంది నరరూప రాక్షసులతో ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ తోనే అతని ఇంట్రాడక్షన్ సీన్ ఉండబోతుందట. ప్రస్తుతానికైతే ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
మరి మొత్తానికైతే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు అడ్వెంచర్స్ సీన్స్ ని అదరగొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు పాస్ పోర్ట్ తీసుకొని తన దగ్గరే ఉన్నట్టుగా ఒక వీడియోను రీసెంట్ గా రిలీజ్ చేశాడు.
ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమా షూట్ ని కూడా స్టార్ట్ చేసి మొదట ఇంట్రాడక్షన్ సీన్స్ నే తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి మహేష్ బాబు ఇంట్రాడక్షన్ సీన్ కనుక చూసినట్లయితే సినిమా మీద భారీ హైప్ ను క్రియేట్ చేస్తుందని సగటు ప్రేక్షకులు కూడా తెలియజేస్తూ ఉండడం విశేషం…