Mahesh Babu: టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు బాలనటులుగా గొప్పగా రాణించి ఆ తర్వాత హీరో గా కూడా సూపర్ స్టార్స్ అయినా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు..మహేష్ బాబు, ఎన్టీఆర్ , తరుణ్ మరియు అల్లు అర్జున్ వంటి వారు కూడా ముందుగా బాలనటులుగా ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తర్వాత హీరోలు గా మారిన వారే..ఇప్పుడు పైన ఫోటో లో మహేష్ బాబు పక్కన ఉన్న ఆ బుడ్డోడు బాలనటుడు కాదు కానీ..ప్రస్తుతం అమ్మాయిల కలల రాకుమారుడిగా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ని ఏర్పచుకున్నాడు.

రీసెంట్ గా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నాడు..అతను మరెవరో కాదు, ప్రముఖ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్..రోషన్ ని మన స్టార్ హీరోలందరూ చిన్నప్పుడు భలే ముద్దు చేసేవారు..మహేష్ బాబు , చిరంజీవి, అఖిల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వంటి వారికి రోషన్ అంటే చాలా ఇష్టం..ఎత్తుకొని ఆడించేవారు కూడా అప్పట్లో.
అలా మహేష్ బాబు ని కలిసినప్పుడు తీసుకున్న ఫోటో అది..రోషన్ బాబు టాలీవుడ్ కి నిర్మల కాన్వెంట్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు..ఈ సినిమాకి అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఒక ముఖ్య పాత్ర కూడా పోషించాడు..కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు..ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని శ్రీకాంత్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయిన పెళ్ళిసందడి టైటిల్ తో ‘పెళ్లి సందD’ చేసి సూపర్ హిట్ ని అందుకున్నాడు.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శిష్యురాలు గౌరీ రోనంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా..రాధావేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చెయ్యడమే కాకుండా ఒక ముఖ్యమైన పాత్రని పోషించాడు..సాంగ్స్ భారీ హిట్ అయ్యాయి..సినిమాలో పెద్ద విషయం లేకపోయినా రోషన్ బాబు డాన్స్ కోసం జనాలు ఎగబడ్డారు..యూత్ లో ఈ సినిమాతో అతనికి మంచి క్రేజ్ కూడా వచ్చేసింది..భవిష్యత్తులో సరైన ప్లానింగ్ తో స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటే టాలీవుడ్ అగ్రహీరోలతో రోషన్ బాబు కూడా ఒకడిగా నిలిచిపోతాడు అనడం లో ఎటువంటి సందేహం లేదు.