Rajinikanth Shivaji Movie: ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్- తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘శివాజీ’ సినీ ప్రేక్షకులందరి ఫేవరెట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా వసూళ్ల పర్వం కురిపించింది. బ్లాక్మ మనీ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. ఇకపోతే ఈ చిత్రంలో రజనీకాంత్ ఎమోషనల్, మాస్ ఎలిమెంట్స్, డ్యాన్స్, ఇతర అన్ని అంశాల్లో సత్తా చాటాడు.శ్రియ రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సంగతులు అలా ఉంచితే.. చిత్రంలో ఓ ఫన్నీ సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది.

రజనీకాంత్ శ్రియను ప్రేమించగా, ఆయన ఇంటికి హీరో తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు. అయితే, పెళ్లికి శ్రియ కుటుంబీకులు నో చెప్తారు. కాగా, పరిచయం పెంచుకునేందుకుగాను దీపావళి పండుగ సందర్భంగా రజనీకాంత్ పండ్లు, ఫలహారాలతో మళ్లీ శ్రియ కుటుంబానికి వెళ్లగా, వారు ఇంటి నుంచి బయటకు వెళ్లగొడుతారు. దాంతో వారిని శ్రియ ఇంటికి ఎదురుగా ఉండే ఓ వ్యక్తి ఆహ్వానిస్తాడు. తనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని, తన ఇంటికి రావాలని ఇన్వైట్ చేస్తాడు.
Also Read: బోల్డ్ ఫోటో షూట్స్ తో యాంకర్ వర్షిణి రచ్చ… అవకాశాల కోసమేనా ఈ పాట్లు !
‘అక్కమ్మ-జక్కమ్మ’ సిస్టర్స్ అంటూ ఇద్దరు కూతుర్లను పరిచయం చేస్తాడు. అయితే, వారిరువురు డీ గ్లామర్ పాత్రల్లో కనబడుతారు. దీనిపై అప్పట్లో పలు అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. అలా ఫన్ జనరేట్ చేయడం కోసమే ఈ సీన్ తీసినట్లు స్పష్టమవుతున్నది. సినిమాలోని అక్కమ్మ జక్కమ్మలను చూసి సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. నిజంగానే వీరు అలా డీ గ్లామర్ గా ఉంటారా ? అని అనుకున్నారు. ఇకపోతే ఈ పిక్చర్ వచ్చి 13 ఏళ్లు అయింది. అయితే, నిజానికి అక్కమ్మ – జక్కమ్మలు అంత డీ గ్లామర్ గా ఉండబోరు. కానీ, పాత్రల కోసం అలా నటించారు.

ఇక వీరిరువురు ‘శివాజీ’ చిత్రం తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అయితే, రియల్ లైఫ్ లో వీరు చాలా అందంగా ఉంటారు. తాజాగా ఈ అక్కా చెల్లెళ్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి కూడా. ఇకపోతే ఆ ఫొటోలను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అక్కమ్మ,జక్కమ్మ సిస్టర్స్ అందగానే ఉన్నారని, కానీ, సినిమా కోసం అలా డీ గ్లామర్ గా కనిపించారని ఫొటోలను చూసి అర్థం చేసుకోవచ్చు.
[…] Oscar Awards 2022: ‘వెండితెర’కు ఆస్కార్ అవార్డ్ ఓ కలల స్వప్నం. ప్రపంచ సినీ లోకంలో ఆస్కార్ ఓ తిరుగులేని రారాజు. అందుకే సినిమా గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని, కనీసం ఆస్కార్ కోసం పోటీపడాలని.. ఒకవేళ ఆ పోటీలో ఆస్కార్ గెలిస్తే, ఇక జీవితం ధన్యమై పోయిందని భావిస్తుంటారు. మొత్తమ్మీద అందమైన అబద్దపు సామ్రాజ్యంలో ఆస్కార్ అందమైన యువరాణిలా అందర్నీ ఊరిస్తూ ఉంటుంది. […]
[…] Mulugu Ramalingeswara Siddhanti: ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్య పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండెపోటుతో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన ప్రముఖ సిద్ధాంతిగా పలు పత్రికలు, ఛానళ్లలో తన ప్రసంగాల ద్వారా ప్రజలకు జ్యోతిష్యం గురించి తన సేవలందించారు. జ్యోతిష్యమంటేనే ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి అనే విధంగా అందరికి సుపరిచితుడైన ఆయన అకాల మరణం చెందడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముప్పై ఏళ్లుగా జ్యోతిష్యంలో సేవలందిస్తున్న ఆయన దేశ విదేశాల్లో కూడా ఆయనకు అనుచరులుండటం గమనార్హం. […]
[…] Corona: దేశంలో మళ్లీ కరోనా భయనాక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజురోజుకూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ ఇప్పటికే వచ్చేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాలను కొవిడ్ మహమ్మారి వణికించేస్తోంది. రోజువారీ కొత్త కేసులు కొద్దిగా తగ్గినా, పాజిటివిటీ రేటు రికార్డు స్థాయికి చేరుకుంది. కొవిడ్ బారిన పడిన వారి మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ వివరాలిలా ఉన్నాయి. […]
[…] Also Read: రజనీకాంత్ ‘శివాజీ’ మూవీలోని అక్కమ్మ… […]