Faima Remuneration: అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు,నిన్న మొన్నటి వరకు దుర్భరమైన జీవితం గడుపుతున్న వాళ్ళు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవచ్చు. కోటీశ్వరులు ఒక్కసారిగా కఠిక దరిద్రానికి కూడా దిగజారిపోవచ్చు. బిగ్ బాస్ ఫేమ్ ఫైమా కి కూడా సరిగ్గా ఇలాంటిదే జరిగింది. పేద కుటుంబం లో పుట్టిన ఈమె తల్లితండ్రులు బీడీలు చుట్టుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఫైమా కూడా పెరిగి పెద్దయిన తర్వాత కూలి పని చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
అలా డబ్బు కోసం యుద్ధం చేస్తున్న సమయం లో ఎందుకో ఆమెకి బుల్లితెర మీద కనిపించాలనే ఆశ పుట్టింది. ఆ ఆశతో బుల్లితెర రంగం లోకి అడుగుపెట్టడానికి ఈమె ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలన్నీ ఒకరోజు సఫలం అయ్యింది, ఈమెకి పటాస్ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కింది.
అక్కడ వచ్చిన ఫేమ్ తో జబర్దస్త్ కామెడీ షో లో ఛాన్స్ కొట్టేసింది.ఇక్కడ ఆమె తనదైన శైలి లో కామెడీ పంచులు వేస్తూ, అందరినీ నవ్విస్తూ కోట్లాది మంది అభిమానులకు దగ్గరైంది.ఇక ఆ తర్వాత ఈమెకి బిగ్ బాస్ సీజన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. ఇప్పుడు మాటీవీ లో అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ లో కమెడియన్ గా కొనసాగుతూ బిజీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.అంతే కాదు BB జోడి ప్రోగ్రాం లో డాన్స్ కంటెస్టెంట్ గా కూడా తన సత్తా చాటి టైటిల్ ని కూడా గెలుచుకుంది.
మొత్తం మీద ఆమె బుల్లితెర రంగం లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా కోటి రూపాయలకు పైగా ఆస్తులను కూడబెట్టిందట.ఇప్పుడు ఈమె కాల్ షీట్ ఒక్క రోజుకి గాను సుమారు పాతిక వేల రూపాయిలు డిమాండ్ చేస్తుందట. కూలి పని చేసుకునే రేంజ్ నుండి ఇక్కడ దాకా వచ్చిందంటే ఆమె కష్టం, దానికి తగ్గట్టుగా అదృష్టం కూడా ఏ రేంజ్ లో కలిసి వచ్చిందో అర్థం చేసుకోవచు.