Jawan
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తుంది. రిలీజై వారం రోజులు కాకముందే రికార్డుల కలెక్షన్లు వసూళ్లు చేస్తోంది. ఈ ఏడాది షారుఖ్ వరుసగా రెండు సినిమాలు హిట్టు కొట్టుకున్నాడన్న చర్చ సాగుతోంది. ఈ సినిమా సక్సెస్ పై షారుఖ్ తో పాటు డైరెక్టర్ అట్లీ పేరు కూడా మారుమోగుతుంది. వరుసగా 5 సినిమా సక్సెస్ కావడంతో సంబరాల్లో మునిగి తేలారు. ఈ తరుణంలో ఈ మూవీ గురించి ఓ ఆసక్తి చర్చ సాగుతోంది. ‘జవాన్’ సినిమా కోసం ముందుగా తెలుగు స్టార్ హీరోలను సంప్రదించాడట అట్లీ. ఈ సినిమాలో నటించమని ఇద్దరిని కోరాడట. కథ నచ్చలేదని రిజెక్ట్ చేశారట. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
ఆర్ఆర్ఆర్ మూవీ అస్కార్ వరకు వెళ్లిన తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీపై అందరి దృష్టి పడింది. ఇక్కడి తెలుగు హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్నాయి. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు హీరో అల్లు అర్జున్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది డైరెక్టర్లు తెలుగు హీరోలతో సినిమాలు తీయాలని ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా ‘జవాన్’ కోసం అట్లీ ముందుగా మనవాళ్లను కలిశాడు.
వీరిలో ముందుగా రామ్ చరణ్ ను కలిశాడట. రామ్ చరణ్ కు ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో ఫేత్ ఉంది. ఇందులో ఆయన నటిస్తే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆకట్టుకుంటారని అట్లీ భావించాడు. దీంతో ఈ సినిమాలో నటించమని కోరాడట. అయితే ‘జవాన్’ కథ విభిన్నంగా ఉండడంతో అందులో నటిస్తే తన కెరీర్ ఏమవుతుందోనని భావించి రిజెక్ట్ చేశాడట. అంతేకాకుండా గతంలో బాలీవుడ్ లో జంజీర్ (తుఫాన్) సినిమా అచ్చీరాలేదు. దీంతో ఎందుకొచ్చిన తంటా అని భావించినట్లు సమాచారం.
దీంతో మరో హీరో సూపర్ స్టార్ మహేష్ బాబును సైతం ఈ సినిమా కోసం అట్లీ కలిశాడట. అయితే మహేష్ ప్రస్తుతం రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడం వల్ల ఇప్పుడున్న ఇమేజ్ తగ్గుతుందని భావించాడట. అందుకే మహేష్ సైతం ఈ సినిమాను వద్దనుకున్నాడట.దీంతో అట్లీ ఏకంగా షారుఖ్ ఖాన్ కలిశాడట. అయితే ముందుగా షారుఖ్ ను కలవడానికి అపాయింటమెంట్ దొరకలేదు. కానీ ఆ తరువాత ఎలాగోలా ఆయనను కలిసి కథ వివరించాక ఇంప్రెస్ అయి తానే నిర్మాతగా ముందుకు వచ్చాడు. ఇప్పుడు లాభాల్లో మునిగితేలుతున్నారు.