Vakeel Saab
Star Hero Who Missed Vakeel Saab: సుమారు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ద్వారా మన ముందుకి వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..హిందీ లో అమితాబ్ బచ్చన్ చేసిన పింక్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని మన తెలుగు నేటివిటీ కి తగట్టు గా కమర్షియల్ ఎలెమెంట్స్ జోడించి పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజి కి తగట్టు గా తీశారు..రెస్పాన్స్ అదిరిపోయింది..పవన్ కళ్యాణ్ ని అద్భుతంగా చూపించాడు ఆ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్..అయితే ఈ సినిమా విడుదల సమయం లో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కరోనా పీక్ స్థాయిలో లో కొనసాగుతుంది..థియేటర్స్ కి జనాలు రావడానికి భయపడుతున్న సమయం లో విడుదలైన కూడా 90 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..OTT మరియు టీవీ లో టెలికాస్ట్ అయినప్పుడు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Vakeel Saab
Also Read: Sai Dharam Tej: పవన్ మూవీ షూటింగ్ లో సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్
అదేమిటి అంటే ఈ సినిమాని తొలుత నందమూరి బాలకృష్ణ తో రీమేక్ చేద్దాం అని అనుకున్నారట..అప్పట్లో ఒక్క ప్రముఖ నిర్మాత బాలయ్య బాబు తో రీమేక్ చెయ్యడానికి చాలా ప్రయత్నాలే చేసాడు..బాలయ్య కూడా అప్పట్లో ఈ సినిమాని రీమేక్ చెయ్యడానికి ఆసక్తి చూపించాడు..కానీ అప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్ ని దిల్ రాజు కొనుగోలు చేసి ఉన్నాడు..ఈ సినిమాని ఆయన పవన్ కళ్యాణ్ తో తియ్యాలనే ఆలోచనలో ఉన్నాడు..దాంతో బాలయ్య బాబు ఎంతో ఇష్టపడి చెయ్యాలనుకున్న వకీల్ సాబ్ సినిమా పవన్ కళ్యాణ్ చేతికి వెళ్ళింది..అయితే ఈ కథ పవన్ కళ్యాణ్ కి సెట్ అయినట్టు టాలీవుడ్ లో ఏ హీరో కి సెట్ కాదని..ఆయన చెయ్యడం వల్లే వకీల్ సాబ్ సినిమాకి అంత గొప్ప రీచ్ వచ్చిందని సినీ విశ్లేషకుల అభిప్రాయం..ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఫామిలీ ఆడియన్స్ లో అద్భుతమైన రీచ్ వచ్చేలా చేసిందనే విషయం మన అందరికి తెలిసిందే.
Bala Krishna
Also Read: Employees Says Goodbye To Jobs: నచ్చితే చేస్తా.. లేకుంటే పోతాం.. కొలువలకు టాటా చెబుతున్న ఉద్యోగులు!