Rajamouli Loss Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు తీసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. జక్కన్న తీసే ఒక్కో సినిమా 2 నుంచి 3 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. కానీ ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకం నిర్మాతల్లో కలుగుతుంది. ప్రతీ సినిమాను భారీ బడ్జెట్ తో తీసి అన్ని హంగులు తీర్చిదిద్దడమే రాజమౌళికున్న ప్రత్యేకత. అందుకే ఆయన తీసిన లాస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ వేదికపైకి వెళ్లింది. రాజమౌళి తన కెరీర్లో మొత్తం 13 చిత్రాలకు డైరెక్షన్ చేశారు. ఇందులో ప్రతీమూవీ ప్రత్యేకమే. అయితే ఇందులో ఓ మూవీ నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టిందట. అదేంటంటే?
రాజమౌళి తో సినిమాలు తీయడానికి కొందరు నిర్మాతలు క్యూ కడుతారు. ఇలాంటి వారిలో భారీ బడ్జెట్ పెట్టేవారే ఎక్కువగా ఉంటారు. రూ.100 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ చేస్తే.. దానిని రెట్టింపు చేస్తారని సదరునిర్మాతల నమ్మకం. అయితే 2004లో రాజమౌళి సినిమా ‘సై’ గురించి చాలా మందికి తెలుసు. కాలేజీ విద్యార్థులు కళాశాల కోసం కష్టపడేనేపథ్యంలో ఈ మూవీ వెండితెరపైకి వచ్చింది. ఆ సమయంలో లవ్, ఎమోషన్ చిత్రాలకు ప్రాధాన్యత ఉన్నాయి. ఇదే సమయంలో ఈ మూవీ రావడంతో ప్రేక్షకులు ఆదరించారు.
నితిన్, జెనిలీయా జంటగా వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా మంచి బ్రేక్ ఇచ్చింది. దీనిని నిర్మించడానికి రూ.12 కోట్లు వెచ్చించారు. కొన్ని ఏరియాల్లో ఈ మూవీని పెద్దగా ఆదరించలేదట. దీంతో చాలా తక్కువ లాభాలు వచ్చాయి. కొందరు డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడి కూడా రాలేదని అనుకుంటున్నారు. దీంతో రాజమౌళి కెరీర్లోనే ఇది డిజాస్టర్ మూవీగా చెప్పుకుంటున్నారు. కథ పరంగా ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందింది. ఇప్పటికీ టీవీల్లో వస్తే తప్పకుండా చూస్తారు.
ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ జోష్ ఇంకా తగ్గలేదు. మల్టీస్టార్ తో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు మహేష్ బాబుతో కూడా తీయబోయే సినిమా ఆగస్టు 29న స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తి కాగానే రాజమౌళితో కలిసి పనిచేయనున్నాడు.