https://oktelugu.com/

V V Vinayak: వి వి వినాయక్ స్టైల్ ను కాపీ చేస్తూ హిట్స్ కొట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?

బోయపాటి శ్రీను ఒకరు. ఈయన వినాయక్ ఎలాంటి సినిమాలు అయితే చేసేవాడో సేమ్ అలాంటి 'కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్లను' తీస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపుని అయితే సంపాదించుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 22, 2024 / 09:29 AM IST
    Follow us on

    V V Vinayak: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు వివి వినాయక్. 2002 వ సంవత్సరంలో వచ్చిన ఆది సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి దర్శకుడిగా పరిచయమైన వినాయక్ ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈయనలా మాస్ సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి వచ్చిన మరికొంత దర్శకులు కూడా స్టార్ డైరెక్టర్లు గా వెలుగొందుతున్నారు.

    అందులో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన వినాయక్ ఎలాంటి సినిమాలు అయితే చేసేవాడో సేమ్ అలాంటి ‘కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్లను’ తీస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపుని అయితే సంపాదించుకున్నాడు. ఇక బాలయ్య బాబుతో ఆయన చేసిన మాస్ సినిమాల గురించి మనందరికీ తెలిసిందే. బాలయ్య ను ఒక రేంజ్ లో చూపించడం లో ఆయనని మించిన వారు ఎవరు లేరు అనేంతలా పేరు తెచ్చుకున్నాడు. ఇక బోయపాటి స్టైల్ ని చూస్తే ఆయన స్టైల్లో కానీ, ఆయన మేకింగ్ లో కానీ, ఆయన పెట్టే బ్లాక్స్ లో గానీ ఎక్కువగా వినాయక్ గారి స్టైల్ కనిపిస్తూ ఉంటుంది.

    ఆయన స్టైల్ ని కాపీ చేస్తూనే ఈయన కూడా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు అంటూ పలువురు సోషల్ మీడియాలో ఆయన పైన చాలా కామెంట్లను కూడా చేశారు. నిజానికి ఆయన కూడా వినాయక్, రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ల లాగే తను కూడా భారీ సినిమాలు తీయాలని ఉద్దేశ్యం తోనే డైరెక్టర్ అయినట్టుగా బోయపాటి ఒక సందర్భంలో తెలియజేశాడు. ఇక తను అనుకున్నట్టుగానే మాస్ లో మంచి ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.

    ఇక ఇప్పుడు బాలయ్య తో మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు…ఇక ఇది ఇలా ఉంటే ఇంతకు ముందు బోయపాటి రామ్ తో చేసిన స్కంద సినిమా ప్లాప్ అయింది. దాంతో ఇప్పుడు ఎలాగైనా బాలయ్య తో ఒక సూపర్ హిట్ సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది…