Tollywood sisters : టాలీవుడ్ లో ఉన్న ఈ అక్కాచెల్లెల్ల గురించి తెలుసా?

కొన్ని సార్లు ఈవెంట్లకు హాజరై అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇక శృతి హాసన్ ఆమె చెల్లెలు కూడా ఒకే పోలికతో కనిపిస్తారు. కానీ కవలలు కాదు.

Written By: Swathi, Updated On : January 19, 2024 4:51 pm
Follow us on

Tollywood sisters : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు హీరోలు అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు రాణిస్తున్నారు. ఇక హీరోయిన్ లు, సింగర్లు, ఇలా మొత్తం మీద సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది ఉన్నారు. అందులో కొందరు ఇప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే మన ఇండస్ట్రీలో కవలలు కూడా ఉన్నారు. అందులో సాయి పల్లవి, తన చెల్లెలు కూడా కవలలు అని తెలిసిందే. అయితే సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సాయి పల్లవి. ఆమె చెల్లెలు కూడా ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇలా మన ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆ కవలలు ఎవరెవరో తెలుసుకుందాం..

లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్.. వీరిద్దరు ట్విన్స్ అన్న విషయం తెలిసిందే. సాయి పల్లవి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంటే.. ఆమె చెల్లెలు పూజా కన్నన్ కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించింది. వీరికి సంబంధించిన ఎన్నో ఫోటోలు ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైట్ మాస్టర్స్ గా రామ్ లక్ష్మణ్ లు గుర్తింపు సంపాదించారు. ఇప్పటికీ కూడా వీరు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు వర్క్ చేస్తున్నారు. వీరిద్దరు కూడా ట్విన్స్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

తెలుగు దర్శకులు ధర్మ, రక్ష కూడా ట్విన్స్ అన్న విషయం చాలా మందికి తెలిసిందే. వీరిద్దరు కలిసి రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ చందమామ రావే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటించారు. అయితే ఈ సినిమా 2017లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అదే విధంగా కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ లు ఇద్దరూ ఒకేలా ఉంటారు కానీ కవలలు కాదు. కాజల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతుంటే.. నిషా పెళ్లి లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ పిల్లలతో సంతోషంగా ఉంటుంది.

సినిమా నటి సిమ్రాన్, మోనల్ లు కూడా ఒకేలా ఉంటారు. వీరి మధ్య పోలికలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అదే విధంగా సీనియర్ హీరోయిన్ జయసుధ తన సోదరి సుభాషిణికి కూడా దగ్గరి పోలికలు ఉంటాయి. కొన్ని సార్లు ఈవెంట్లకు హాజరై అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇక శృతి హాసన్ ఆమె చెల్లెలు కూడా ఒకే పోలికతో కనిపిస్తారు. కానీ కవలలు కాదు.