Ram Gopal Varma Life Story: కాంట్రవర్సరీ కింగ్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మాట్లాడినా లేదంటే ట్వీట్ చేసినా సరే అది చివరకు కాంట్రవర్సీనే అవుతుంది. ప్రతి సంఘటనపై సినిమా తీసి వివాదాలు రాజేస్తుంటారు. అయితే ఈరోజు ఈ కాంట్రవర్సీ కింగ్ పుట్టిన రోజు. మరి ఆయన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల గురించి తెలుసుకుందాం.
1962 ఏప్రిల్ 7 న విజయవాడలో పుట్టాడు ఆర్జీవీ. కృష్ణంరాజు, సూరమ్మ అమ్మానాన్నలు. అయితే ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ఆయన సినిమాల వైపు మల్లాడు. ఆ క్రమంలో ఒక వీడియో పార్లర్ కూడా నడిపాడు. ఇక నాగేశ్వర రావు హీరోగా చేసిన రావుగారి ఇల్లు మూవీ సినిమాకు ఆర్జీవీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ సమయంలోనే ఆయనకు నాగార్జునతో మంచి స్నేహం ఏర్పడింది.
దీంతో ఆర్జీవీకి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. చాలా కథలను రాసుకున్న తర్వాత ఆర్జీవీ శివ మూవీ కథను వినిపించాడు. ఇది బాగానచ్చడంతో నాగార్జున ఓకే చెప్పి తీశాడు. అయితే తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఆర్జీవీ. అప్పటి వరకు చప్పగా సాగుతున్న తెలుగు సినిమాలకు మాస్ యాంగిల్‌ను పరిచయం చేశాడు. అందుకే తెలుగు సినిమాల గురించి చెప్పాలంనుకుంటే.. శివ మూవీకి ముందు.. ఆ తర్వాత అన్నట్టు చెబుతారు.
Also Read: Venkatesh Remake Movies: వెంకటేశ్ నటించిన టాప్ 10 రీమేక్ మూవీలు ఏవో తెలుసా..?
ఈ మూవీ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఇక దీని తర్వాత ఆయన ఎక్కువగా మాఫియా, హార్రర్ బ్యాక్ గ్రౌండ్ మూవీలను తీసి గుర్తింపు తెచ్చుకున్నారు. దీని తర్వాత వెంకటేశ్, శ్రీదేవి హీరోయిన్లుగా తీసిన క్షణక్షణం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కొత్త స్క్రీన్ ప్లేను ఇండస్టరీకి పరిచయం చేశాడు ఆర్జీవీ. 1993లో జగపతి బాబు హీరోగా తీసిన గాయం సంచలన విజయం సాధించింది.
శివ మూవీకి గాను ఆర్జీవీ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఇక నాగార్జున, శ్రీదేవి జంటగా ఆర్జీవీ తీసిన గోవిందా.. గోవిందా సినిమా చాలా పెద్ద దుమారమే రేపింది. ఈ మూవీలో విలన్లు వేంకటేశ్వర స్వామి కిరీటాన్ని ఎత్తుకెళ్లే సన్నివేశం హిందువుల మనోభావాలను దెబ్బ తీసింది. అప్పట్లో ఇది పెద్ద రచ్చ చేసింది. దీంతో తాను తెలుగు సినిమాలు చేయబోనంటూ శపథం చేశాడు రాము.
కానీ తన శపథాన్ని పక్కన పెట్టేసి మళ్లీ తెలుగులో మూవీలు తీశాడు. కొంత కాలం తర్వాత బాలీవుడ్‌కు చెక్కేశాడు. అక్కడ కూడా సంచలన విజయాలను నమోదు చేశాడు. 1994లో అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిలా మెయిన్ పాత్రల్లో వర్మ డైరెక్ట్ చేసిన రంగీలా మూవీ బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిందనే చెప్పాలి. దీని తర్వాత అతను అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. ఇక సత్య మూవీ అయితే రాము దర్శకత్వ ప్రతిభ ఏంటో బాలీవుడ్‌కు రుచి చూపించింది. ఈ మూవీ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సంచలన కలెక్షన్లు వసూలు చేసింది.
ఇక దీని తర్వాత అజయ్ దేవగన్ తో కంపెనీ మూవీ తీసి సంచలన సక్సెస్ అందుకున్నాడు. బిగ్ బి అమితాబ్ తో తీసిన సర్కార్ బాలీవుడ్ ను ఏలేసింది. దీనికి సీక్వెల్ గా వచ్చిన సర్కార్ రాజ్ మంచి హిట్ కొట్టింది. దీని తర్వాత మరో సీక్వెల్ గా వచ్చిన సర్కార్-3 మాత్రం ప్లాప్ అయిపోయింది.
అలా ఒకప్పుడు సంచలన సినిమాలను తీసి ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టిన ఆర్జీవీ.. ఆ తర్వాత కాంట్రవర్సీ సినిమాలను ఎక్కువగా తీస్తూ విమర్శల పాలవుతున్నారు. ముఖ్యంగా తెలుగులో తీసిన రక్త చరిత్ర, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, బెజవాడ, దిశ లాంటి నిజ జీవిత సంఘటనలు, మనుషుల కథలను తెర మీద తీసి వావాదాలు రాజేశాడు ఆర్జీవీ.
ప్రస్తుతం నా ఇష్టం అంటూ ఇద్దరు లెస్బియన్ అమ్మాయిల మధ్య జరిగే క్రైమ్ కథతో మూవీ తీస్తున్నాడు. అయితే దీన్ని తమ థియేటర్లలో వేయబోమంటూ చాలామంది బ్యాన్ చేస్తున్నారు. అయినా సరే అవేవీ పట్టించుకోడు ఆర్జీవీ. ఇక్కడ కాకుంటే ఇంకో చోట అన్నట్టు ఆయన దూసుకుపోతుంటారు.
టాలీవుడ్ లో చాలామంది టాప్ డైరెక్టర్లు ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చిన వారే. ఇందులో కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, హరీష్ శంకర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక మధుర్ బండార్కర్, శివనాగేశ్వర్రావు, అనురాగ్ కశ్యప్, తేజ లాంటి వారందరూ ఆర్జీవీ దగ్గర శిష్యులుగా పనిచేశారు. ఇక అమ్మాయిలంటే తనకు ఎంతో ఇష్టం అంటూ ఆర్జీవీ చెబుతారు. అమ్మాయిలను రాము ఆరాధించినట్టు ఎవరూ ఆరాధించలేరేమో.
ఇలా ఒకప్పుడు ఇండియన్ సినిమాలను ఏలిన రాము.. ఇప్పుడు వివాదాల రాముగా మారిపోయాడు. ఆయన వివాదాస్పద సినిమా తీస్తారా లేక తీసిన సినిమానే వివాదాస్పదం అవుతుందా అంటే చెప్పలేం. మొత్తానికి రాము ఏం చేసినా చివరకు కాంట్రవర్సీనే. అదే రామూయిజం. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం.
Also Read:Raja Mouli: ఆ విషయంలో ‘తగ్గెదేలే’ అంటున్న జక్కన్న..!
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Do you know about these incidents that happened in the life of rgv
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com