Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినీ ఇండస్ట్రీకి డైలాగ్స్ రైటర్ గా పరిచయం అయ్యాడు. ఆయన మాటలు ఫేమస్ కావడంతో డైరెక్టర్ అయి సక్సెస్ ఫుల్ సినిమాలు తీస్తున్నాడు. స్టార్ హీరోతో సమానంగా త్రివిక్రమ్ కు ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన సినిమాలను ఎంత ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. త్రివిక్రమ్ తో పాటు చాలా మంది నటులకు సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు. కొందరు హీరోలు మాత్రమే కాకుండా.. నటులు సైతం రిపీట్ అవుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఆయన స్నేహితుడిగా ఉన్న సునీల్ ను పలు సినిమాల్లో చూపించాడు. కానీ ఇప్పుడు మరో వ్యక్తి కూడా త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఆయన అలా కనిపించడానికి పెద్ద కారణమే ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..
పై ఫొటోలో కనిపించే నటుడి పేరు షమ్మి సాయి. ఈయనది భీమవరం. ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయన త్రివిక్రమ్ సినిమాల్లో ఎందుకు కనిపిస్తున్నాడో.. త్రివిక్రమ్ ది కూడా భీమవరం కావడంతో చిన్నప్పటి నుంచి ఆయన పరిచయం. త్రివిక్రమ్ సినిమాల్లోకి వచ్చాక షమ్మిసాయికి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉందని ఒకసారి చెప్పాడు. దీంతో మహేష్ బాబు ‘అతడు’ సినిమా నుంచి ప్రతీ సినిమాలో షమ్మి సాయి కనిపిస్తాడు. కానీ ఈయన ఇలా కనిపించి అలా మాయమవుతాడు. కానీ ఉన్నంతసేపు ఆయన కామెడీ మాత్రం ఆకట్టుకుంటుంది.
త్రివిక్రమ్ సినిమాల్లోనే కాకుండా ఇతర సినిమాల్లోనూ షమ్మిసాయి నటించారు. కానీ త్రివిక్రమ్ తీసిన రీసెంట్ మూవీ ‘అలా వైకుంఠపురం’లోనూ ఆయన ఉన్నాడంటే.. ఆయనపై త్రివిక్రమ్ కు ఎలాంటి అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఒకరు ఎంట్రీ ఇస్తే వారితో పాటు మరికొంత మంది వస్తారని అందరికీ తెలిసిందే. ఇక సొంతూరుకు చెందిన వ్యక్తి అయితే ఎవరైనా కాదంటారా? అందుకే షమ్మిసాయికి మంచి కామెడీని అందించి ఆయనతో కామెడీ చేయిస్తున్నాడు.
ప్రస్తుతం తివిక్రమ్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’తో బిజీ అయ్యాడు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. అయితే ఇందులో కూడా ఉన్నాడా? అంటే ఉండే ఉంటాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు త్రివిక్రమ్ కు చెందిన ఒక్క సినిమాను కూడా ఆయన మిస్ చేయలేదు.ఈ సినిమాలో షమ్మిసాయికి ఏదో ఒక పాత్ర ఇస్తాడని అనుకుంటున్నారు. మరి షమ్మిసాయి ఈసారి ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించి, అలరిస్తాడో చూడాలి.