
లాక్డౌన్లోనూ పెళ్లిళ్లు చేసుకునేందుకే కొందరు మొగ్గుచూపుతున్నారు. ఈ విషయంలో సామాన్యులు సంయమనం పాటిస్తుంటే సెలబ్రెటీలు మాత్రం ఆగలేకపోతున్నారు. మాస్కులతోనే పెళ్లిళ్లు చేసుకుంటూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. కొందరు లాక్డౌన్లో పెళ్లిళ్లను సపోర్ట్ చేస్తుండటా మెజార్టీ ప్రజలు మాత్రం తప్పుబడుతున్నాయి. వీటన్నింటిని పట్టించుకోకుండా కొందరు పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నారు. ఇటీవలే బడా నిర్మాత దిల్ రాజు హడావుడి పెళ్లి చేసుకోగా అతడిని అనుసరిస్తూ హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే హీరో నితిన్ మాత్రం లాక్డౌన్లో పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. జీవితంలో మధురానుభూతిని అందించే పెళ్లి వేడుక మిస్ అయ్యేకంటే.. పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత చేసుకోవడమే బెటరని భావిస్తున్నాడు. అందరి సమక్షంలో ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలని నితిన్ అనుకుంటున్నాడట. తన కాబోయే భార్య షాలినీకి ఈ విషయం చెప్పడంతో ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే నిఖిల్, నితిన్ ప్రేమ విషయాలు ఒకేసారి బయటపడ్డాయి. అంతేకాకుండా ఒకేసారి ఎంగేజ్ మెంట్ జరిగాయి. ఇక పెళ్లిళ్లు కూడా ఒకే సమయానికి వచ్చాయి. అయితే లాక్డౌన్ కారణంగా వీరిద్దరు పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. అయితే నిఖిల్ తన పెళ్లి మే 14న జరుగుతుందని ప్రకటించాడు. అయితే కేంద్రం లాక్డౌన్ పొడగించడంతో మరోసారి పెళ్లి వాయిదా వేయడం ఇష్టంలేక.. మళ్లీ తొందర్లోనే ముహుర్తాలు లేకపోవడంతో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.