మొదటి సినిమాతోనే బోల్డ్ నెస్ తో యువతను కట్టిపడేసింది ‘పాయల్ రాజ్ పుత్’. ఇప్పుడు అదే ఆమెకు పెద్ద శాపం అయింది. వచ్చే అవకాశాలు అన్నీ బరితెగించే పాత్రలేనట. ఒక చిత్రంలో బోల్డ్ గా కనిపించినంత మాత్రానా.. ఇక కెరీర్ మొత్తం అలాంటి పాత్రలే చేయాలా ? అయినా ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో నేను బోల్డ్ గా కనిపించడం సినిమా కథకు అవసరం, ఎందుకంటే.. బోల్డ్ నెస్ కి మించిన బలమైన కథ అందులో ఉంది. అందుకే నేను ఆ సినిమాలో అలా మితిమీరిన ముద్దుల సన్నివేశాల్లో హద్దులు దాటాను. అంతే కానీ, నాకు హీరోల మూతి నాకాలని ఏమీ లేదు.
దయచేసి నా దగ్గరకు బూతు సినిమాలను తీసుకురావొద్దు. ఈ మాటలన్నీ పాయల్ తాజాగా ఓ మేనేజర్ తో మొర పెట్టుకున్న మాటలు. తన పై నెగటివిటీకి బదులు రెట్టింపు క్రేజ్ రావాలి. కానీ రోజురోజుకూ ఆమెకు ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గిపోతుందట. వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడం ఎంత కష్టమో తనకి ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుందని అంటుంది పాయల్. నిజానికి తన ఇమేజ్ ను తానే చేజేతులా నాశనం చేసుకుంది పాయల్. బోల్డ్ క్యారెక్టర్ ద్వారా పరిచయమైన పాయల్ దాన్నుండి బయటపడాలని మొదట్లో ప్రయత్నం చేయలేదు.
పైగా భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారని.. ఆ తర్వాత ‘సీత’ సినిమాలో ఒక భారీ హాట్ ఐటెమ్ సాంగ్ చేసింది.అక్కడి నుండే ఆమెకు బోల్డ్ హీరోయిన్ అనే ముద్ర బలంగా పడిపోయింది. ఆ ముద్ర పడుతుంది అని గ్రహించని పాయల్.. ఆ తర్వాత ఆర్డిఎక్స్ లవ్ అంటూ మరో బోల్డ్ అటెంప్ట్ చేసింది. ఇక అంతే.. ఈ భామ కెరీర్ కి అది అతి పెద్ద మైనస్ గా నిలిచిపోయింది. దాంతో ప్రస్తుతం బోల్డ్ నెస్ పేరుతో దిగజారుడు పాత్రలు మాత్రమే పాయల్ కి వస్తున్నాయి.