Amardeep: బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అప్ గా నిలిచాడు అమర్ దీప్. ఫినాలే ఈవెంట్ ముగిసిన తర్వాత తన భార్య, తల్లితో కలిసి ఇంటికి వెళ్తున్న అమర్ దీప్ కారు పై దాడి జరిగింది. కారు పై రాళ్లు విసరడం తో వెనక వైపు అద్దాలు పగిలాయి. దీంతో అతని కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ షాక్ కు గురైయ్యారు. ఈ ఘటనపై అమర్ స్పందిస్తూ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు.
కాగా వీడియోలో అమర్ దీప్ మాట్లాడుతూ .. ‘ అందరికీ నమస్కారం .. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు పాదాభివందనం. మీలో ఒక్కడిగా నన్ను చూసారు. ఇంతకన్నా నేను చెప్పుకోడానికి ఏమీ లేదు. గెలవలేను అనుకున్నవాణ్ణి .. గెలుపుదాకా తీసుకొచ్చి గెలిపించారు. ఇంతకు మించిన అదృష్టం లేదు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే .. చాలా మంది నన్ను అడుగుతున్నారు. నేను ఈ విషయాన్ని చెప్పాలని కూడా అనుకోలేదు .. బాధలో ఉండి పోయాను అని అమర్ అన్నాడు.
‘ కారు అద్దాలు పగలగొట్టారు .. బయటకి రా నీ అంతు చూస్తాం అన్నారు. నేను ఒక్కడినే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకొండి .. నాకేం భయం లేదు. ఎవరికి భయపడను .. భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా అమ్మ, అక్క, భార్య, చెల్లి ఉంటారు. వాళ్ళు మన పక్కన ఉన్నపుడు ఎలా ప్రవర్తించాలో ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కారు అద్దం పగిలినపుడు గాజు పెంకులన్నీ మా అమ్మ ,తేజు మీద పడ్డాయి.
రాళ్ల దాడి వల్ల ఏదైనా జరిగి ఉంటే ఈ రోజు నేను ఎవరిని కోల్పోయేవాడినో నాకు తెలియదు అని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇలాంటివి ఎవరికీ జరగకూడదు. ఇంకెప్పుడు ఇలా చేయకండి మీకు కోపం ఉంటే తిట్టండి పడతాను. నా కుటుంబాన్ని భాదపెట్టారు అయినా నేను అది పట్టించుకోలేదు. రవితేజ గారు నాకు సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పుడే నేను గెలిచాను .. కానీ ఆనందతో బయటకు వస్తాననుకున్న నన్ను నా కుటుంబంతో సహా రోడ్డు పై నిలబెట్టారు. చాలా బాధేసింది .. దయచేసి ఇలా ఎవరి మీద ప్రవర్తించకండి. నా మీద కోపం ఉంటే ఎక్కడికి రమ్మన్నా వస్తాను .. ఇలా ఎవరిని చేయకండి .. థాంక్యూ ఆల్ అని వీడియోలో చెప్పుకొచ్చాడు అమర్ దీప్.