https://oktelugu.com/

Siddu Jonnalagadda: రీమేక్స్ మోజులో పడిపోయిన DJ టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ

Siddu Jonnalagadda: ఈ ఏడాది అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలలో ఒకటి DJ టిల్లు..ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ సినిమాకి కాసుల కనకవర్షం కురిసింది..కేవలం ఆరు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకి దాదాపుగా 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చింది..ఇక ఈ సినిమాలో హీరో గా నటించిన సిద్దు జొన్నలగడ్డ కి కూడా యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది..ఆయన సంభాషణలు యూత్ కి పిచ్చెక్కిపోయేలా చేసింది..సోషల్ మీడియా లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 15, 2022 / 08:47 AM IST
    Follow us on

    Siddu Jonnalagadda: ఈ ఏడాది అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలలో ఒకటి DJ టిల్లు..ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ సినిమాకి కాసుల కనకవర్షం కురిసింది..కేవలం ఆరు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకి దాదాపుగా 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చింది..ఇక ఈ సినిమాలో హీరో గా నటించిన సిద్దు జొన్నలగడ్డ కి కూడా యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది..ఆయన సంభాషణలు యూత్ కి పిచ్చెక్కిపోయేలా చేసింది..సోషల్ మీడియా లో ‘మేమె’ వాడకం కూడా ఈమధ్య ఎక్కువగా ఈ సినిమాకి సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి..అతి త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ కూడా తెరకెక్కబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ సీక్వెల్ కి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి..అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోబోతుంది ఈ చిత్రం..ఇది పక్కనే పెడితే సిద్దు జొన్నలగడ్డ తర్వాతి ప్రాజెక్ట్స్ కూడా యూత్ ని ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి.

    Siddu Jonnalagadda

    DJ టిల్లు సీక్వెల్ తర్వాత ఆయన ఇటీవలే మలయాళం లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ‘తుళ్లుమాల’ సినిమాని సిద్దు రీమేక్ చేయబోతున్నాడట..మలయాళం లో హీరోగా తొనివో థామస్ నటించగా, హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ నటించింది..కేవలం పది కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది..అలాంటి సినిమా ఇక్కడ రీమేక్ గా తెరకెక్కితే సూపర్ హిట్ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

    Siddu Jonnalagadda

    కానీ ‘తళ్ళుమాల’ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు లో కూడా అందుబాటులో ఉంది..మంచి రెస్పాన్స్ ని కూడా రప్పించుకుంది..ఈ సినిమాని చూసేదే యూత్ ఆడియన్స్..యూత్ ఆడియన్స్ మొత్తం నెట్ ఫ్లిక్స్ లో చూసేసిన తర్వాత కూడా తెలుగు లో రీమేక్ చేస్తే వర్కౌట్ అవుతుందా అనే సందేహం అందరిలో నెలకొంది..ఏది ఏమైనా OTT బాగా అభివృద్ధి చెందిన కాలం లో రీమేక్ అంటే పెద్ద సాహసమే..మరి సిద్దు జొన్నలగడ్డ రీమేక్ చేసి సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి

    Tags