Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో దీపావళి పండుగ స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు,స్నేహితులు వస్తున్నారు. పండుగ స్పెషల్ కావడంతో వెండితెర, బుల్లితెర కు సంబంధించిన సెలెబ్రెటీస్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. ముందుగా శ్రీ లీలా,వైష్ణవ్ తేజ్ ఆదికేశవులు సినిమా గురించి ప్రమోట్ చేశారు. తర్వాత హైపర్ ఆది క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు. ఇక నాన్ స్టాప్ పంచులతో అల్లాడించాడు ఆది. మన్మధుడు సినిమాలో నాగార్జున గారికి లేడీస్ అంటే పడరు .. అలానే ఈ సీజన్ లేడీస్ అందరిని ఫస్ట్ హాఫ్ లో పంపించేశారు అని ఆది అన్నాడు.
ఇక హౌస్ లో బెస్ట్ బౌలర్ అంటే తేజ గాడు .. నామినేషన్స్ అప్పుడు.. వాడు వేసిన సిల్లీ బాల్స్ కి ఆరుగురు అవుట్ అయ్యారు సార్ .. కానీ అలాంటి తేజ గాడిని.. మరో సిల్లీ బాల్ తో వాడిని అవుట్ చేశారన్న మీరూ అని శివాజీ కి పంచ్ పేల్చాడు ఆది. దాంతో అందరూ తెగ నవ్వుకున్నారు. అమర్ తో ‘ నువ్వు నీ కోసం పుట్ట లేదురా .. శోభా ని కెప్టెన్ చేయడానికి పుట్టావు .. తిప్పరా మీసం అంటూ నవ్వులు పూయించారు హైపర్ ఆది.
ఆ తర్వాత శోభా శెట్టి కోసం ఆమె తండ్రి తో పాటు ప్రియుడు స్టేజ్ పైకి వచ్చారు. ప్రియుడిని చూసి శోభా ముఖం వెలిగిపోయింది. సంతోషంలో తేలిపోయింది. ఇక నాగార్జున నువ్వు మూడేళ్ళుగా దాచిపెట్టిన సీక్రెట్ ని మేము బయటకు లాగేసాం అని అనగానే శోభా తెగ సిగ్గు పడింది. ముందుగా తండ్రిని ఎలా ఉన్నావ్ అంటూ పలకరించింది. తర్వాత బాయ్ ఫ్రెండ్ ని చూస్తూ ఎమోషనల్ అయింది. ఏడవకు .. బాగా ఆడు అని శోభా లవర్ చెప్పాడు. అది ఒకటేనా.. అని శోభ అడిగింది. కాగా ‘ లవ్ యు .. అని ప్రియుడు చెప్పగానే ‘లవ్ యు టూ ‘ అంటూ మెలికలు తిరిగింది శోభా శెట్టి.
అయితే శోభా బాయ్ ఫ్రెండ్ ఇతనా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్నేళ్లుగా శోభా తన లవర్ గురించి ఎక్కడా చెప్పలేదు. బిగ్ హౌస్ లో అప్పుడప్పుడు తేజ తో బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడేది. కానీ పేరు మాత్రం చెప్పలేదు. ఇప్పుడు అతడిని ఏకంగా స్టేజి మీదకి తీసుకొచ్చి బిగ్ బాస్ టీమ్ కుండబద్దలు కొట్టారు. మరోవైపు ఎలిమినేషన్ ప్రాసెస్ జరిపారు.
శివాజీ, గౌతమ్, రతిక సేవ్ అయ్యారు. డేంజర్ జోన్లో యావర్, భోలే మిగిలారు. భోలే ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పారు. భోలే హుందాగా బయటకు వచ్చేశాడు. తన ఫ్రెండ్ అశ్విని బాగా ఏడ్చింది. వేదిక మీద కూడా భోలే చక్కగా మాట్లాడాడు. అప్పటికప్పుడు ట్యూన్, లిరిక్స్ కట్టి బిగ్ బాస్ హౌస్ మేట్స్ మీద, నాగార్జున మీద పాటలు పాడారు. ఈ వేదికగా భోలే షావలి ఒకడు ఉన్నాడనే గుర్తింపు వచ్చినందుకు హ్యాపీ అన్నాడు.