Divyavani: దర్శకుడు బాపు తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో పెళ్లి పుస్తకం ఒకటి. బాపు-రమణలు కలిసి పెళ్లి పుస్తకం మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించారు. రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి జంటగా నటించారు. కామెడీ, రొమాన్స్, ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ”శ్రీరస్తు శుభమస్తు” సాంగ్ ఎవరు గ్రీన్. పెళ్లి పుస్తకం మూవీ విడుదలై దశాబ్దాలు అవుతున్నా.. శ్రీరస్తు శుభమస్తు సాంగ్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది.
దివ్యవాణికి పెళ్లి పుస్తకం మూవీ ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆమెకు బాపు బొమ్మ అనే ట్యాగ్ ఇచ్చారు తెలుగు ఆడియన్స్. కాగా కొండవీటి దొంగ మూవీలో రాధ, విజయశాంతి హీరోయిన్స్ గా నటించారు. కాగా దివ్యవాణి సైతం ఓ పాత్ర చేసింది. కాగా కొండవీటి దొంగ మూవీలోని ‘శుభ లేఖ రాసుకున్నా” సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంది. రాధ-చిరంజీవి ఈ సాంగ్ లో నటించారు.
అయితే ఈ సాంగ్ లో నిజానికి దివ్యవాణి-చిరంజీవి నటించాల్సింది అట. చిరంజీవి కూడా దివ్యవాణితో నీకు ఒక సాంగ్ ఉంటుందని చెప్పాడట. దాంతో దివ్యవాణి చాలా సంతోషం వ్యక్తం చేసిందట. చివరికి స్క్రిప్ట్ మార్చేసి.. దివ్యవాణి కోసం అనుకున్న పాటను రాధతో చేయించారట. ఆ సినిమాకు రచయితగా ఉన్న పరుచూరి గోపాల కృష్ణ ఈ విషయాన్ని దివ్యవాణితో చెప్పాడట. ఆ సాంగ్ నువ్వే చేయాల్సింది. కానీ మేము ఏం చేయలేకపోయాము అన్నారట. దివ్యవాణి చాలా బాధపడిందట. ఏడ్చిందట.
అలాగే చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్ గా ఉన్న ఘరానా మొగుడు మూవీలో కూడా దివ్యవాణికి ఆఫర్ వచ్చిందట. వాణి విశ్వనాథ్ చేసిన పాత్రకు దివ్యవాణిని అనుకున్నారట. అది కొంచెం గ్లామరస్ రోల్ కావడంతో దివ్యవాణి చేయలేదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. ఘరానా మొగుడు మూవీలో చిరంజీవి-వాణి వ్ విశ్వనాథ్ కెమిస్ట్రీ బాగుంటుంది.