Divvela Madhuri Interview: రాజకీయ నేపథ్యం ఉన్నోళ్లు బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెడితే ఈ అవ్వుధి?, వాళ్ళ రాజకీయ పద్ధతుల్లోనే గేమ్స్ ఆడుతారు, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని చిన్న చూపు చూస్తారు, రాజకీయ పలుకుబడి ఉపయోగించి తమకు అనుకూలంగా ఫలితాలను రప్పించుకుంటారు, ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి దివ్వెల మాధురి ని తీసుకొస్తే ఇవన్నీ జరుగుతాయని అంతా అనుకున్నారు. అనుకున్నట్టు గానే అవన్నీ జరిగాయి. హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే ఆమె తన తోటి కంటెస్టెంట్స్ తో పొగరు గా మాట్లాడడం, బేస్ వాయిస్ నోరు మూసుకో లాంటి కామెంట్స్ చేయడం, ఇవన్నీ మనం చూసాము. ఈమెతో దువ్వాడ శ్రీనివాస్ హౌస్ లో కనీసం 5 వారాలు ఆమె ఉండేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు అనే టాక్ బలంగా వినిపించింది. అందుకే తనూజ కి ఉద్దేశపూర్వకంగానే సేవింగ్ పవర్ ఇప్పించారని కూడా అన్నారు.
కానీ ఆమెకు హౌస్ లో ఉండాలని అనిపించకపోవడం తో సేవింగ్ పవర్ ని ఉపయోగించుకోకుండా బయటకు వచ్చేసింది. ఇది ఆమె బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ లో కూడా శివాజీ తో అంటుంది. నేను ఉండాలని అనుకుంటే ఉండేదానిని అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్తుంది. అంటే సోషల్ మీడియా లో ప్రచారమైన వార్తల్లో ఎంతోకొంత నిజముంది అనుకోవచ్చు. ఇదంతా పెడితే భరణి ఎలిమినేట్ అవ్వడం, ఆ తర్వాత హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం పై సంతోషించే ఆడియన్స్ ఉన్నారు, అదే సమయం లో విమర్శించే ఆడియన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే భరణి కి అవకాశం ఇచ్చినప్పుడు, మిగిలిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కి కూడా అవకాశాలు ఇవ్వొచ్చు కదా, ఎందుకు భరణి కి మాత్రం స్పెషల్ గా అవకాశం ఇచ్చారు అనే అనుమానాలు ఉన్నాయి. అందుకు కారణం ఆయనకు రాజకీయ నేపథ్యం ఉండడం వల్లనేనా అని సోషల్ మీడియా లో విమర్శలు వినిపించాయి.
భరణి ని సపోర్ట్ చేసే వాళ్లకు కూడా ఈ సందేహాలు ఉన్నాయి. దీనిపై మాధురి కూడా రీసెంట్ గా ఆమె జాఫర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పందిస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘నేను ఆడియన్స్ ఓట్లు వేయక ఎలిమినేట్ అయ్యాను అంటే అసలు నమ్మను. అక్కడ హౌస్ లో వాళ్లకు కావాల్సిన వాళ్ళని ఉంచుకుంటున్నారు, ఆడియన్స్ ఓటింగ్ తో వెళ్లిపోయిన భరణి గారు, మళ్లీ అదే ఆడియన్స్ ఓటింగ్ తో వారం రోజుల్లో ఎలా తిరిగివస్తాడు?’ అని అంటుంది. అప్పుడు జాఫర్ ‘ఎలా వచ్చారని అనుకుంటున్నారు?’ అని అడగ్గా, దానికి మాధురి స్పందిస్తూ ‘ఆయన గురువు గారు నాగ బాబు ఉన్నాడు కదా, ఆయన వల్ల వచ్చి ఉండొచ్చు’ అని అంటుంది. కేవలం నాగబాబు కి అంత పెద్ద షో ని కంట్రోల్ చేసే సత్తా ఉందా అని అడిగితే, దానికి మాధురి సమాధానం చెప్తూ ‘ఆయన తమ్ముడు డిప్యూటీ సీఎం కదా..ఏదైనా జరిగి ఉండొచ్చు’ అని అంటుంది. ఆలోచిస్తే ఆమె చెప్పేది కూడా లాజిక్కే కదా అని ఆడియన్స్ కి కూడా అనిపిస్తుంది.