https://oktelugu.com/

Kollywood : విడిపోయిన మరో సెలబ్రెటీ జంట.. వీరి లైఫ్ జర్నీ తెలుసా?

డియర్ సినిమా పేరుతోనే ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేశారు. అయితే జీవీ ప్రకాష్ 2013 లో సింగర్ సైంధవిని పెళ్లి చేసుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 15, 2024 / 04:07 PM IST

    GV Prakash (2)

    Follow us on

    Kollywood : మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. చాలా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో డార్లింగ్ సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నారు. రీసెంట్ గా వచ్చిన ఆదికేశవ సినిమాకి కూడా సంగీతం అందించారు ప్రకాష్.ఈయన ఏఆర్ రెహమాన్ కి బంధువు అవుతారు అనే సంగతి తెలిసిందే. ఈమధ్య జీవీ ప్రకాష్ హీరోగా కూడా నటిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తూనే, హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన డియర్ అనే సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

    డియర్ సినిమా పేరుతోనే ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేశారు. అయితే జీవీ ప్రకాష్ 2013 లో సింగర్ సైంధవిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరికి ఒకరు తెలుసు. స్కూల్ సమయం నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. దాదాపు పది సంవత్సరాలు వీళ్లు ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి కుటుంబాలను ఒప్పించి ఆనందంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత చాలా ఇంటర్వ్యూలలో జీవీ ప్రకాష్ సైంధవి గురించి చాలా గొప్పగా కూడా చెప్పారు. వీళ్ళిద్దరికీ 2020 లో ఒక పాప పుట్టింది. అందరూ వీళ్లు చాలా ఆనందంగా ఉన్నారు అని అనుకున్నారు.

    కానీ ఇవాళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళిద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారు. తమ మానసిక ప్రశాంతత కోసం వాళ్ళిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయం మీద చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. “మానసిక ప్రశాంతత లేకపోతే ముందే విడిపోవాలి కానీ పిల్లలు పుట్టాక విడిపోవడం ఏంటి?” అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇలా సెలబ్రిటీలు విడిపోవడం కొత్త కాదు. కానీ వీళ్లు చిన్నప్పటి నుంచి ఒకరికి ఒకరు తెలుసు. 10 సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. ఒక మనిషిని మరో మనిషి అర్థం చేసుకోవడానికి ఇంతకంటే ఎక్కువ కాలం అవసరం లేదు.

    సంవత్సరంలోనే మనిషి గురించి అంతా తెలిసిపోతుంది. ఇన్ని సంవత్సరాలు కలిసి జీవించాక ఇప్పుడు విడిపోవడం ఏంటి? అసలు విడిపోయేంత నిర్ణయం తీసుకోవడానికి ఏ కారణం ఉంది? అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరి కొంత మంది అయితే 2020 నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి అంటున్నారు. ఈ కారణంగానే ఒకరి గురించి ఒకరు బయట ఎక్కువగా చెప్పుకోవట్లేదు అని, అసలు వీళ్ళిద్దరూ విడిపోతారని ముందే అనుకున్నట్టు కొంత మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.