https://oktelugu.com/

మెగాస్టార్ దెబ్బకు దివి రేంజ్ మారింది !

తెలుగు బిగ్‌ బాస్ షోకి వెళ్లి మంచి పాపులారిటీతో చాలామంది చిన్న నటులు స్టార్ డమ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరికీ బాగానే మేలు జరిగింది. తమకు వచ్చిన క్రేజ్ తో కెరీర్ ను బిల్డ్ చేసుకున్నారు చాలామంది. అయితే, దివి వైద్య మాత్రం బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో వరుస ఛాన్స్ లు పట్టేస్తోంది. ఈ సీజన్‌ కి వెళ్లిన […]

Written By:
  • admin
  • , Updated On : February 4, 2021 / 11:01 AM IST
    Follow us on


    తెలుగు బిగ్‌ బాస్ షోకి వెళ్లి మంచి పాపులారిటీతో చాలామంది చిన్న నటులు స్టార్ డమ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరికీ బాగానే మేలు జరిగింది. తమకు వచ్చిన క్రేజ్ తో కెరీర్ ను బిల్డ్ చేసుకున్నారు చాలామంది. అయితే, దివి వైద్య మాత్రం బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో వరుస ఛాన్స్ లు పట్టేస్తోంది. ఈ సీజన్‌ కి వెళ్లిన వారిలో దివి మొదట్లో సైలెంట్ గర్ల్‏ గా కనిపించినా.. ఆ తర్వాత తన మాటా, ఆటతీరుతో మంచి గుర్తింపు పొంది.. ఈ క్రమంలో తనలో మంచి నటి కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది.

    Also Read: ఉప్పెన మూవీలో అది ఇండస్ట్రీని షేక్ చేస్తుందట..

    దీనికి తోడు ఈ షో ఫైనాల్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని అందరి ముందు చెప్పడంతో ఒక్కసారిగా దివి రేంజే మారిపోయింది. దర్శకనిర్మాతల నుంచి వరుస ఆఫర్లను వస్తున్నాయి ఆమెకు. ఇలా వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. అలాగే తాజాగా మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాను ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలోనే పాల్గొంటుంది. అలాగే మరో సినిమా ఈ రోజు మొదలుపెట్టనుంది.

    Also Read: తాగి బరువెక్కానా?.. చనిపోవాలనుకున్నా.. హీరోయిన్ హాట్ కామెంట్స్

    కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభంకానుంది. ఇవే కాకుండా త్వరలోనే మరో రెండు సినిమాలలో కూడా దివి నటించనున్నట్లుగా సమాచారం. నిజానికి దివి మొన్నటివరకు హీరోయిన్‌గా అవకాశాలు కావాలంటూ వచ్చిన అవకాశాలను వదులుకుంటూ వచ్చింది. ఆమె ఆశించినట్లుగా మొత్తానికి దివికి హీరోయిన్ గానే అవకాశాలు వస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్