Nani: డిజిటల్ రంగం ఊహకు మించి ప్రేక్షకుల ఆదరణ రాబడుతుంది. లాక్ డౌన్ పరిస్థితులు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వైపు జనాలు మొగ్గు చూపేలా చేశాయి. పాండమిక్ సమయంలో థియేటర్స్ మూతపడడంతో జనాలకు ఓటిటిలు ప్రధాన వినోద సాధనాలుగా మారిపోయాయి. చాలా మంది కొత్తవారు వాటికి అలవాటు పడ్డారు. రోజురోజుకూ పెరుతున్న డిమాండ్ నేపథ్యంలో సినిమాలకు ధీటుగా ఓటిటి కంటెంట్ తెరకెక్కుతుంది.

ఈ పరిణామం థియేటర్స్ మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చేసే ప్రమాదం ఉంది. థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఓటిటి విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కళాత్మక వ్యాపారమైన సినిమాలు నేరుగా ఓటిటి విడుదలకు వచ్చేస్తున్నాయి. గతంలో మొదట థియేటర్స్ లో విడుదలయ్యాక సినిమా రన్ ని బట్టి నిర్ణీత సమయంలో ఓటిటిలో చేసేవారు.
చిన్న సినిమాల ఆర్థిక ఇబ్బందులు, విడుదల కష్టాల రీత్యా నేరుగా ఓటిటిలో విడుదల చేస్తున్నారంటే అర్థం వుంది. కానీ దశాబ్దాల కాలం పరిశ్రమలో ఉండి, థియేటర్స్ వ్యవస్థ ద్వారా ఎదిగిన బడా ప్రొడ్యూసర్స్, స్టార్ హీరోలు కూడా లాభాపేక్షకు తలొగ్గి, నేరుగా ఓటిటిలో విడుదల చేయడం, విచారకరం. కాగా హీరో నాని గత రెండు చిత్రాలు వి, టక్ జగదీశ్ డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేశారు.
వి మూవీ పూర్తి లాక్ డౌన్ సమయంలో విడుదలైంది. దీనితో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇటీవల విడుదలైన టక్ జగదీశ్ విషయంలో నాని పై డిస్ట్రిబ్యూటర్స్ విమర్శలకు దిగారు. అతనిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నాని లాంటి టూ టైర్ హీరోని విమర్శించిన డిస్ట్రిబ్యూటర్స్ వెంకటేష్ జోలికి వెళ్లడం లేదు.
Also Read: Samantha: ఆ విషయంలో ఓకే చెప్పేందుకు భాష పెద్ద సమస్య కాదంటున్న సమంత
ఆయనను పల్లెత్తు మాట అనడం లేదు. వెంకటేష్ గత చిత్రం నారప్ప ఓటిటిలో విడుదల కావడం జరిగింది. మరో చిత్రం దృశ్యం ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. మరి నానిని టార్గెట్ చేసిన వారు, అదే పని చేస్తున్న వెంకీని మాత్రం ఏమీ అనకపోవడం తో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ పాట.. అందులో నిజమెంత?