Chiranjeevi Rajamouli Comments On IBomma: విడుదలైన మొదటి రోజే HD క్వాలిటీ తో సినిమాలు పైరసీ అవుతుంటే నిర్మాతలు వీటిని అరికట్టడం ఎలాగో తెలియక ఎంతో మనస్థాపానికి గురి అయ్యారు. ముఖ్యంగా ‘గేమ్ చేంజర్’ చిత్రం నుండి పైరసీ వేరే లెవెల్ కి చేరింది. ప్రతీ సినిమా ఓటీటీ లో విడుదలైనప్పుడు ఎలా ఉంటుందో, అంతటి క్వాలిటీ తో సినిమా ఆన్లైన్ లోకి అందుబాటులోకి రావడం చూసి నిర్మాతలు మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా కొత్త సినిమాలను పైరసీ చేయడం లో ఐ బొమ్మ రవి మంచి నిపుణుడు. కొంతకాలం క్రితమే ఆయన పోలీసులకు సవాలు విసురుతూ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ విడుదల చేసిన ఒక వీడియో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అంతే కాకుండా ఐ బొమ్మ సైట్ ని కూడా నిలిపివేశారు.
ఐ-బొమ్మ వాళ్లు సవాళ్లు విసురుతుంటే తట్టుకోలేకపోయా
చాలా ఏళ్ల నుంచి ఈ పైరసీ అనే మహమ్మారి నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆందోళన చెందాం
ఎంతో మంది కష్టాన్ని ఒకడు అప్పనంగా దోచుకుంటుంటే బాధ అయ్యేది
హైదరాబాద్ పోలీసులకు ఈ విషయంలో సినీ పరిశ్రమ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా
— BIG TV Breaking News (@bigtvtelugu) November 17, 2025
ఐ బొమ్మ ఆగడాలను అరికట్టిన ఈ సందర్భంగా CP సజ్జనార్(CP Sajjanar) నేడు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి పలు కీలకమైన వ్యాఖ్యలు చేసాడు. ఈ ప్రెస్ మీట్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), రాజమౌళి(SS Rajamouli) వంటి వారు హాజరు అయ్యారు. ముందుగా చిరంజీవి మాట్లాడుతూ ‘మా ఇండస్ట్రీ చాలా సంవత్సరాల నుండే పైరసీ సమస్య ని ఎదురుకుంటూ వస్తోంది. దీని నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం అయ్యేది కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు వచ్చి అప్పనంగా దోచుకోవడం, మన ఎదురు గా వచ్చి సవాళ్లు విసురుతుండడం చూసి తట్టుకోలేకపోయాను. ఇలాంటి వాళ్ళను ఎలా అరికట్టాలి అని తర్జభర్జన పడుతున్న సమయంలో CP సజ్జనార్ మరియు పోలీస్ బృందం కలిసి ఒకరోజు కూర్చొని దీని గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకున్నాడు. హైదరాబాద్ పోలీసులకు ఈ సందర్భంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఐబొమ్మ రవి అరెస్ట్ సినిమాలో విలన్ను అరెస్ట్ చేసినట్లు చేశారు…
#ibomma #SSRajamouli pic.twitter.com/lzSbYIq5g3
— Milagro Movies (@MilagroMovies) November 17, 2025
ఇక ఆ తర్వాత రాజమౌళి మాట్లాడుతూ ‘సజ్జనార్ గారికి, సీవీ ఆనంద్ గారికి, తెలంగాణ పోలీస్ బృందానికి మొత్తం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదేదో మంచి సూపర్ హిట్ కమర్షియల్ సినిమాని చూస్తున్నట్టు ఉంది. విలన్ పోలీసులకు సవాలు విసిరితే, వాడిని వెతికి పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టారు’ అంటూ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో పైరసీ భూతాన్ని సమూలంగా అరికట్టేందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఇండస్ట్రీ కూడా మాకు అన్ని విధాలుగా సహకరించాలి అని ఈ సందర్భంగా సజ్జనార్ కోరారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ రెండు వీడియోలను మీరు కూడా చూసేయండి.