
Disha Patani- Samantha: సోషల్ మీడియా లో ఎల్లపుడూ యాక్టీవ్ గా ఉండే స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత..తనకి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది,అంతే కాకుండా అప్పుడప్పుడు కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం కూడా మనం చాలాసార్లు గమనించి ఉంటాము.అభిమానులు మరియు దురాభిమానుల పెట్టే కామెంట్స్ కి కూడా ఆమె రియాక్ట్ అవ్వడం మనం చాలాసార్లు గమనించాము.
మయోసిటిస్ వ్యాధి తో చికిత్స తీసుకుంటున్న సమయం లో సోషల్ మీడియా కి కాస్త దూరంగా ఉన్న సమంత ఇప్పుడు పూర్తిగా కోలుకోవడం తో సినిమా షూటింగ్స్ లో బిజీ గా ఉండడం తో పాటుగా, సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా ఉంటుంది.రీసెంట్ గా ఆమె ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని పెట్టిన ఇంస్టాగ్రామ్ వీడియో కి సమంత పెట్టిన కామెంట్ వైరల్ గా మారింది.
సమంత లాగానే దిశా పటాని కూడా మంచి ఫిట్నెస్ ఫ్రీక్..ఆమె సోషల్ మీడియా లో పెట్టే పది పోస్టులలో 90 శాతం ఆమె ఫిట్నెస్ మరియు యోగా కి సంబంధించిన పోస్టులే పెడుతూ ఉంటుంది.రీసెంట్ గానే ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది,అందుకు సంబంధించిన ప్రాక్టీస్ వీడియో ని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చెయ్యగా సమంత ఆ వీడియో క్రింద ‘ది రియల్ డీల్’ అనే కామెంట్ పెట్టింది.సమంత అంతకుముందు కూడా ఇలాంటి కామెంట్స్ బాగా పెట్టింది కానీ, అవన్నీ టాలీవుడ్ హీరోలకు లేదా హీరోయిన్స్ కి సంబంధించిన పోస్టులకు మాత్రమే కామెంట్స్ పెట్టేది.

కానీ ఈమధ్యనే ఆమె బాలీవుడ్ లో బాగా బిజీ అయ్యింది.అక్కడి హీరోలతో మరియు హీరోయిన్స్ తో బాగా క్లోజ్ అయ్యింది, ఈమధ్య కామెంట్స్ అన్నీ వాళ్ళ గురించే పెడుతుంది సమంత, ఇదంతా చూస్తుంటే సమంత ద్రుష్టి పూర్తిగా టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి మరలిందా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.