Prabhas Project K: ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా లెవల్లోకి మారింది. అప్పటి నుంచి ఆయనతో భారీ బడ్జెట్ చిత్రాలే తీస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత భారీ అంచనాలు పెట్టుకున్న ‘సాహో’, ‘రాధేశ్యామ్’ నిరాశపరిచాయి. కానీ హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా డార్గింగ్ భారీ చిత్రాలకే ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం ‘సాలార్’తో బిజీ అయిన ఈ హీరో అంతకుముందే నాగ్ అశ్విన్ తో ‘ప్రాజెక్ట్ కె’కే కు సైన్ చేశాడు. వైజయంతి మూవీస్ నిర్మాణంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఇందులో దీపికా పదుకునే కథానాయక. అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనిపై తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ‘ప్రాజెక్ట్ -కె’ కథను రూపొందించారు. దీంతో ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ ఏడాది చివరి వరకు లేదా.. వచ్చే ఏడాది ప్రారంభ నెల వరకు షూటింగ్ తీయనున్నారు. ఆ తరువాత మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కే టైం కేటాయించనున్నారు. హిస్టారికల్ నేపథ్యం ఉండడంతో ఆ ఎఫెక్ట్ రావడానికి విజువల్స్ వాడనున్నారు. ఇలా సంవత్సరం పాటు విజువల్ ఎఫెక్ట్స్ పనిమీదే ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ సినిమా రిలీజ్ ముందు అనుకున్న సమయానికంటే గడుపు పెంచినట్లు తెలుస్తోంది.
సినిమా రెగ్యులర్ గా షూటింగ్ జరిపి అన్నీ హంగులతో 2023 దసరా కానుకగా థియేటర్లోకి తీసుకొద్దామనుకున్నారు. కానీ విజువల్ వర్క్ కు మరింత సమయం తీసుకున్నట్లు సినిమా వర్గాలు తెలుపుతున్నాయి. అంటే ఏడాది పాటు ఆగి 2024 ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. హిస్టారిక్ నేపథ్యంతో పాటు యుద్ధ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో గ్రాఫిక్స్ వర్క్ యాడ్ చేయనున్నారు. దీంతో సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏప్రిల్ 2024 వరకు ఎలాంటి ఆటంకాలు లేకపోతే ఓకే.. కానీ అప్పుడు కూడా ఏదైనా సమస్య వస్తే అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక ఈ సినిమాను నాగ్ అశ్విన్ ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నారట. వరుస హిట్లతో జోరుమీదున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ కు మంచి హిట్టు అందించాలని తపన పడుతున్నాడట. అటు వైజయంతి మూవీస్ ఏర్పడి 2024 ఏప్రిల్ 24కు 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఆ సందర్భగా సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారట. మరోవైపు ప్రభాస్ బాహుబలి కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ అయింది. అనుకున్నట్లు ఈ తేదీనే రిలీజ్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే పండుగ.