Bigg Boss 6 Telugu Grand Finale: బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలే నిన్న ఎంత ఘనంగా జరిగిందో అందరికి తెలిసిందే..ఈ సీజన్ లో రేవంత్ – శ్రీహాన్ ఇద్దరు గెలిచారు కానీ..టైటిల్ విన్నర్ మాత్రం రేవంత్ ని వరించింది..బిగ్ బాస్ ఎన్నో ఆఫర్స్ తో ఆయనని టెంప్ట్ చేసినా కూడా కరగకుండా ట్రోఫీ కోసమే బలంగా నిలబడ్డాడు..శ్రీహాన్ కంటే ఓట్లు తక్కువవచ్చినప్పటికీ ట్రోఫీ గెలిచాడు..పది లక్షల రూపాయిల క్యాష్ తో పాటుగా పాతిక లక్షలు విలువ చేసే ఫ్లాట్ మరియు కార్ ని గెలుచుకున్నాడు.

ఆద్యంతం వినోదభరితంగా ఎంతో సరదాగా సాగిపోయిన గ్రాండ్ ఫినాలే కి టీఆర్ఫీ రేటింగ్స్ అద్భుతంగా వచ్చి ఉంటుందని అందరూ అనుకున్నారు..కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఫినాలే ఎపిసోడ్ కి కూడా ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదట..కేవలం 7 నుండి 8 పాయింట్ల మధ్యనే టీఆర్ఫీ రేటింగ్స్ ఉంటాయని తెలుస్తుంది..ఫినాలే ఎపిసోడ్ బాగున్నప్పటికీ నిన్న జరిగిన FIFA వరల్డ్ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రభాస్ బిగ్ బాస్ మీద బలంగా పడిందని అంటున్నారు విశ్లేషకులు.
అంతే కాకుండా ఈ సీజన్ మొత్తం ఆశించిన స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ రాకపోవడం తో,అదే ఫ్లోలో వచ్చిన గ్రాండ్ ఫినాలే కి కూడా రేటింగ్స్ రాలేదని తెలుస్తుంది..ఫుట్ బాల్ మ్యాచ్ తో పాటుగా ఈటీవీ లో నిన్న ‘పాడుతా తియ్యగా’ గ్రాండ్ ఫినాలే కూడా జరగడం కాస్త ప్రభావం చూపించిందనే చెప్పాలి..గత రెండు సీజన్స్ ఫినాలే ఎపిసోడ్స్ కి 20 రేటింగ్స్ తగ్గకుండా వచ్చాయి..కానీ ఈసారి కేవలం సింగిల్ డిజిట్ రేటింగ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది..ప్రారంభ ఎపిసోడ్ కి కూడా సింగల్ డిజిట్ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి..అలా టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో ఈ సీజన్ ఫ్లాప్ అవ్వడం తో తదుపరి సీజన్ లో పెనుమార్పులు చెయ్యబోతుందట బిగ్ బాస్ టీం.

అక్కినేని నాగార్జున కి కూడా ఇదే చివరి సీజన్ అట..తదుపరి సీజన్ నుండి నందమూరి బాలకృష్ణ ని వ్యాఖ్యాతగా తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు..ఇప్పటికే ఆయనని ఈ విషయమై సంప్రదించగా, ఆయన కూడా ఈ షో చెయ్యడానికి అమితాసక్తిని చూపిస్తున్నాడట..కంటెస్టెంట్స్ విషయం లో కూడా ఈసారి ఎక్కడా తగ్గకుండా ఉండే విధంగా చూస్తున్నారట..ప్రేక్షకులకు బాగా ముఖ పరిచయం ఉన్న సెలబ్రిటీస్ ని మాత్రమే తదుపరి సీజన్ లో తీసుకోబోతున్నట్టు సమాచారం.