SS Rajamouli- Sukumar: నేషనల్ అవార్డ్స్ కూడా తెలుగులో ఆ ముగ్గురు డైరెక్టర్లే తోపు అని రుజువు చేశాయా?

మొన్నటి వరకు ఏ తెలుగు హీరోకి నేషనల్ అవార్డు రాలేదు. కానీ ఆ కోరికను సుకుమార్ తీర్చాడు. అల్లు అర్జున్ ని పవర్ ఫుల్ గా పుష్ప రాజ్ గా చూపించి ఆయనకి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టారు మన సుకుమార్.

Written By: Swathi, Updated On : August 25, 2023 11:21 am

SS Rajamouli- Sukumar

Follow us on

SS Rajamouli- Sukumar: సినిమా అంటే ఎంతో మంది కష్టం. కానీ ఆ సినిమాకు ద‌ర్శ‌కుడే ప్రాణం ! త‌న ఆలోచ‌న‌లో నుంచి పుట్టిన క‌థ‌ను.. ప్రేక్షకులు ఎన్నో రోజులు గుర్తుపెట్టుకునేలా తీయగలిగే కెప్టెన్ దర్శకుడు. 24 క్రాఫ్ట్స్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా న‌డిపించేందుకు ఎంతో శ్ర‌మిస్తాడు దర్శకుడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రభావం ఎక్కువగా దర్శకుడి మీడే పడుతుంది. అలాంటి దర్శకత్వాన్ని ప్రస్తుతం అవలీలగా చేసి…ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన నేతి తరం దర్శకులు ముగ్గరు.

వారే దర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి…లెక్కల మాస్టర్ సుకుమార్…మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
సినిమా మీద ఉన్న ప్యాష‌న్‌తో వీరు ముగ్గురు సినిమాల్లోకి వ‌చ్చి ద‌ర్శ‌కులుగా స‌త్తా చాటారు. తెలుగు ప్రేక్షకులే కాదు నేషనల్ లెవెల్ లో సినీ ప్రముఖులు కూడా వీరు ముగ్గురు టాప్ డైరెక్టర్స్ అని ఒప్పుకున్నారు. అది ఎలాగా అంటారా.. ఎంతో ప్రధానమైన అవార్డ్స్.. నేషనల్ అవార్డ్స్ లో మన తెలుగు సినిమాల సత్తా చాటారు ఈ దర్శకులు.

మొన్నటి వరకు ఏ తెలుగు హీరోకి నేషనల్ అవార్డు రాలేదు. కానీ ఆ కోరికను సుకుమార్ తీర్చాడు. అల్లు అర్జున్ ని పవర్ ఫుల్ గా పుష్ప రాజ్ గా చూపించి ఆయనకి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టారు మన సుకుమార్. ఇక రాజమౌళి గురించి చెప్పనవసరం లేదు.. మన తెలుగు సినిమాని బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఈ డైరెక్టర్ ఆయన లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ ద్వారా దాదాపు 6 విభాగాలలో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నారు.

ఇక మూడేళ్ల క్రితమే అనగా 2020లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అలా వైకుంఠపురం సినిమాకి కూడా ఒక నేషనల్ అవార్డు వచ్చింది. ఇలా మన భారతదేశంలో అత్యంత గౌరవించబడే నేషనల్ అవార్డ్స్ లో సైతం మన తెలుగు సినిమాలను ప్రథమ స్థానంలో ఉంచి…ఈ డైరెక్టర్ మన తెలుగు సినిమాలకు వీరే సూపర్ హీరోస్ అని రుజువు చేసుకున్నారు.

ఒకరు సినిమాని అన్ని విభాగాలలో అద్భుతంగా తీయగలిగే డైరెక్టర్…మరొకరు మాటలతో మంత్రం చేసే డైరెక్టర్.. ఇంకొకరు మన బుర్రకి పదును పెట్టి.. సినిమాను ఎంతో ఇంట్రెస్టింగ్ గా తీయగలిగే డైరెక్టర్.. ఇలా ఈ ముగ్గురు వారి వారి టాలెంట్ తో టాప్ వన్ లో నిలిచారు. మరి ఈ డైరెక్టర్స్ ఇలానే కంటిన్యూ అయ్యి మన తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచాలి అని ఆశిద్దాం.