Movie directors: సినిమాలో కామెడీ ఎందుకు ? కామెడీ సినిమాలు చూసి మనం ఏం తెలుసుకుంటాం ? ఏం నేర్చుకుంటాం ? అందుకే, కామెడీ సినిమాలు చేయడం దిగువస్థాయి పని అంటూ నిన్నటి తరం దర్శకుల కులంలో బలమైన ఓ వాదన ఉండేది. అందుకే, కామెడీ చేయగలిగే దమ్ము ఉండి కూడా కొంతమంది దర్శకులు కామెడీ జోలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు.

దాంతో బలమైన కామెడీ సినిమాలు మిస్ అయ్యాయి. ఇంకా మనం జంధ్యాల దగ్గరే ఆగిపోయాం అంటే.. తెలుగు సినిమాకు నిజమైన హాస్యం ఎంత అవసరం ఉందో అర్థం చేసుకోవాలి. ఎందుకు సినిమా అంటే లవ్ స్టోరీ, లేదా యాక్షన్ స్టోరీ అనే ఒక ముద్ర బలంగా ఎందుకు పడిపోయింది. నవరసాలు ఉన్న తెలుగు భాషలో సినిమాల పరంగా మాత్రం నవరసాలు ఎందుకు కనబడటం లేదు.
ప్రజలకు హీరోలు గొప్పగా కంపించడానికి వారికి నాటకీయ అంశాలు కావాలి. యాక్షన్ కావాలి. కానీ, హీరోలు, ప్రేక్షకులకు నచ్చాలి అంటే మాత్రం వాళ్ళు కామెడీ చేయగలగాలి. అప్పుడే సినిమా వర్కౌట్ అవుతుంది. ఈ జనరేషన్ అపుడే సినిమా చూడటానికి థియేటర్స్ కు వస్తున్నారు. లేదంటే.. ఇంటికే పరిమితం అయిపోతున్నారు. మొత్తమ్మీద కామెడీ అవసరం నేడు చాలా ఉంది.
Also Read: రివ్యూలు సినిమాలకు మేలు చేయాలంటే అలా చేయండి !
కానీ, ఆ హాస్య చిత్రాలకు ప్రాణం పోయగలిగే దర్శకులే లేకుండా పోయారు. కృష్ణం వందే జగద్గురుం సినిమాలో చెప్పినట్లు.. దేవుడు అంటే సాయం, ఖలేజా సినిమాలో చెప్పినట్లు ‘దైవం మానుష రూపేణ’. అలాగే నేడు సినిమా అంటే.. హాస్యం. హాయిగా నవ్వుకుని సంతోషంగా ఉండటమే సినిమా ప్రధాన టార్గెట్ అయిపోయింది.
ఒకప్పుడు సూపర్ హీరోల సినిమాలు బాగా చూసేవారు. ఇప్పుడు ఎవరి సినిమాలు చూస్తున్నారో తెలుసా? కామెడీ హీరోల సినిమాలు. కామిక్ సినిమాలలో ఒక్క కామెడీనే కాదు, మంచి ఫిలాసఫీ, బలమైన లౌక్యం, విలువైన తర్కం కూడా ఉంటుంది. పైగా నేటి జీవితాలకు అన్వయించుకోగలిగిన కథాంశాలు కూడా కామెడీ చిత్రాల్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇప్పటికైనా దర్శకులూ కామెడీ సినిమాలను పెంచండి. ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూయించండి.
Also Read: మరో మూవీని కూడా ఓటీటీ లో రిలీజ్ చేయనున్న నిర్మాత సురేష్ బాబు… కారణం ఏంటంటే ?