UdayKiran Teja : ఉదయ్ కిరణ్ మరణం టాలీవుడ్ లో అత్యంత్య విషాదకర సంఘటనగా ఉంది. అతి తక్కువ కాలంలో తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలచివేసింది. ఉదయ్ కిరణ్ ఈ ఘోరానికి ఎందుకు పాల్పడ్డారు? ఆయన మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. అనేక వాదనలు ఉన్నప్పటికీ ఖచ్చితమైన కారణం తెలియదు. సున్నిత మనస్కుడైన ఉదయ్ కిరణ్ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పరిస్థితికి దారి తీసిన అంశాలు ఏంటనేది బయటకు రాలేదు.

ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో తెలుసన్న తేజా ఆ విషయం భవిష్యత్ లో వెల్లడిస్తాను అన్నారు. తేజ మాటలు పరిశీలిస్తే ఆయన మరణం వెనుక ఎవరో ఉన్నారన్న భావన కలుగుతుంది. దర్శకుడు తేజతో ఉదయ్ కిరణ్ కి విడదీయరాని అనుబంధం ఉంది. ఉదయ్ కిరణ్ ని హీరో చేసింది తేజానే. చిత్రం మూవీతో ఉదయ్ కిరణ్ ని వెండితెరకు పరిచయం చేశాడు. దర్శకుడిగా తేజాకు అది మొదటి చిత్రం. రెండో చిత్రం కూడా తేజ-ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో నువ్వు నేను చేశారు. నువ్వు నేను మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఉదయ్ కిరణ్ ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో ‘ఔనన్నా కాదన్నా’ టైటిల్ తో మరో చిత్రం చేశారు. ఇది అంచనాలు అందుకోలేకపోయింది. ఈ సినిమా నాటికి తేజా సైతం ప్లాప్స్ లో ఉన్నారు. 2008 తర్వాత ఉదయ్ కిరణ్ కి రెండేళ్ల గ్యాప్ వచ్చింది. 2014 జనవరిలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు ఉదయ్ కిరణ్ సైన్ చేసిన చాలా సినిమాలు ఆగిపోయినట్లు సమాచారం.