Allu Arvind : గేమ్ చేంజర్’ ని టార్గెట్ చేసిన అల్లు అరవింద్.. సంక్రాంతి బరిలో నాగ చైతన్య ‘తండేల్’!

అల్లు అరవింద్ 'గేమ్ చేంజర్' చిత్రం తో క్లాష్ పెట్టుకునేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం ఆయన అక్కినేని నాగ చైతన్య తో 'తండేల్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'కార్తికేయ 2 ' ఫేమ్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

Written By: Neelambaram, Updated On : October 15, 2024 9:43 pm

Allu Arvind

Follow us on

Allu Arvind : మెగా మరియు అల్లు కంపౌండ్స్ మధ్య దూరం పెరిగింది, ఒకరంటే ఒకరికి పడడం లేదు, కోల్డ్ వార్ నడుస్తుంది అని ఇండస్ట్రీ లో చాలా కాలం నుండి ఒక రూమర్ ప్రచారం అవుతూనే ఉంది. ఈ రూమర్ ని చెరిపివేసే కార్యక్రమం అటు అల్లు కాంపౌండ్ నుండి, ఇటు మెగా కాంపౌండ్ నుండి ఎవ్వరూ ప్రయత్నం చేయడం లేదు. మా మధ్య గొడవలు ఉన్న విషయం వాస్తవమే అనే విధంగా అల్లు కాంపౌండ్ చెప్పే ప్రయత్నాలు చేస్తుంది. అల్లు అర్జున్ నంద్యాల కి వెళ్లిన ఘటన నుండి ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అల్లు కాంపౌండ్ కన్ను రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంపై పడింది. దసరా పండుగ రోజు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని జనవరి 10 వ తారీఖున పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు.

వాస్తవానికి ఆ తేదీన మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం రావాలి. కానీ దిల్ రాజు అడిగిన వెంటనే తమ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కే చిత్రం అయినప్పటికీ కూడా చిరంజీవి మాటలకు గౌరవించి నిర్మాతలు వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు అల్లు అరవింద్ ‘గేమ్ చేంజర్’ చిత్రం తో క్లాష్ పెట్టుకునేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం ఆయన అక్కినేని నాగ చైతన్య తో ‘తండేల్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘కార్తికేయ 2 ‘ ఫేమ్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సుమారుగా ఈ చిత్రం కోసం 80 కోట్ల రూపాయిలను ఖర్చు చేసాడు అల్లు అరవింద్. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. టాకీ పార్ట్ ని 80 శాతానికి పైగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, నవంబర్ నెలాఖరుకి షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకోబోతుంది.

ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి దింపే ప్లాన్ లో ఉన్నాడు నిర్మాత అల్లు అరవింద్. భారీ బడ్జెట్ సినిమా అవ్వడంతో ఈ చిత్రాన్ని సంక్రాంతికి దింపాలి అనుకోవడం లో తప్పు లేదు. ఎందుకంటే నాగ చైతన్య కి అంత పెద్ద మార్కెట్ లేదు. ఆయన స్థాయికి మించిన ప్రాజెక్ట్ అది, సంక్రాంతికి కాకుండా వేరే డేట్ కి విడుదలై ఒకవేళ పాజిటివ్ టాక్ రాకపోతే వసూళ్ల మీద ఘోరమైన ప్రభావ చూపే అవకాశం ఉంది. అందుకే సేఫ్ గా సంక్రాంతికి రావాలని అనుకుంటున్నారు. కానీ బయట అభిమానులు ఇలాంటివి అర్థం చేసుకోవడం కష్టం. కావాలని రామ్ చరణ్ మీద కోపంతోనే ఈ చిత్రాన్ని క్లాష్ కి దింపుతున్నారని అనుకుంటారు. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన రోజు ఏ స్థాయి గొడవలు జరుగుతాయో చూడాలి. జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు.