Director Shankar: ప్రస్తుత సమాజంలో ఆడవారిగా పుట్టడమే పాపమా అనే విధంగా వరుస ఘటనలు జరుగుతున్నాయి. చిన్నారుల నుంచి ముసలి వారి వరకు కామాంధులు ఎవర్ని వదలడం లేదు. ఈ మధ్యకాలంలో మహిళలపై లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవంటి ఘటనలకు ఆకతాయిలు పాలపడడం ఇన్నాళ్ళు చూశాం. ఇప్పుడు ఒక సెలబ్రిటీ కూడా ఈ ఘటనకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు కేసులో… ప్రముఖ దర్శకుడు శంకర్ అల్లుడు రోహిత్ దామోదరన్ అరెస్ట్ అయ్యాడు.
ఈ కేసులో అతనితో పాటు మరో ఐదుగురిని ఇటీవల పుదుచ్చేరిలో పోలీసులు అరెస్టు చేశారు. 16 సంవత్సరాల అమ్మాయిని లైంగికంగా వేధించారు అన్న ఆరోపణలు వీళ్లపై అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే బాధితురాలి ఫిర్యాదు మేరకు… రోహిత్, అతని స్నేహితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ లో శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు రోహిత్ దామోదరన్. క్రికెటర్ అయిన రోహిత్… అంతకు ముందు ఓ క్రికెట్ క్లబ్ కెప్టెన్గా కూడా పనిచేశాడు.
రోహిత్ తండ్రి దామోదరన్ , క్రికెట్ కోచ్ థమరై కన్నన్ తో పాటు మరో ఇద్దరు పైన పుదుచ్చేరిలోని మోట్టు పాలయం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. తాను క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన సమయంలో తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఈ వేధింపులపై ఎవరికీ చెప్పొద్దు అని కూడా తనని బెదిరించారని ఫిర్యాదులో వెల్లడించింది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Director shankar son in law arrested in harassment case
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com