https://oktelugu.com/

Director Shankar : ‘గేమ్ చేంజర్’ కి డైరెక్టర్ శంకర్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? ఆ డబ్బులతో మరో పాన్ ఇండియా సినిమా తీయవచ్చు!

ఈ సినిమాకి శంకర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే ప్రశ్న మీ అందరిలో ఉండడం సహజమే. అందరూ అనుకుంటున్నట్టు ఆయన 50 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఈ సినిమాకి అందుకోలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : December 31, 2024 / 09:29 PM IST

    Director Shankar

    Follow us on

    Director Shankar : డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది..ఆయన ఒక తెరిచిన చరిత్ర పుస్తకం. ఆయన సినిమాలు డైరెక్టర్స్ కి ఒక నిఘంటువు లాగా అనిపిస్తాది. కమర్షియల్ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు ఇండస్ట్రీ ని ఏలుతున్న రోజుల్లో, అవుట్ ఆఫ్ ది బాక్స్ గా అలోచించి, ఎన్ని తరాల ప్రేక్షకులు చూసినా అమితంగా ఇష్టపడే రేంజ్ లో ఆయన పాత సినిమాలు ఉంటాయి. ఆరోజుల్లో శంకర్ కి ఇలాంటి ఆలోచనలు అసలు ఎలా వచ్చాయి అని ఆ సినిమాల్లోని సన్నివేశాలు చూసినప్పుడు మనకి అనిపించక తప్పదు. రోబో చిత్రం వరకు, అనగా 2010 వ సంవత్సరం వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో శంకర్ కి పోటీ ని ఇచ్చే డైరెక్టర్ మరొకరు లేరు. కానీ ఆ సినిమా తర్వాత ఎందుకో శంకర్ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. కమర్షియల్ గా శంకర్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా సక్సెస్ అయ్యాయి కానీ, కంటెంట్ పరంగా ఇది శంకర్ రేంజ్ సినిమాలు కావే అని అనిపించింది.

    ఇక ఆయన రీసెంట్ చిత్రం ‘ఇండియన్ 2 ‘ తో శంకరేనా ఈ సినిమా తీసింది?, ఇంత దరిద్రంగా ఉందేంటి అని చూసిన ప్రతీ ఒక్కరు పెదవి విరిచారు. ఇప్పుడు ఆయన దర్శకత్వం లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో పది రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి ఆయన ఎంతో కసిగా పని చేసాడు. రీసెంట్ గానే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి అద్భుతమైన రిపోర్ట్స్ వచ్చాయి. శంకర్ భారీ కం బ్యాక్ ఈ చిత్రం తోనే ఉండబోతుందని, ఆయన వింటేజ్ సినిమాలను చూసి అభిమానులు ఎలా అయితే మురిసిపోయారో, ఆ విధంగా ఈ చిత్రం ఉండబోతుందని చెప్తున్నారు. రేపు విడుదల అవ్వబోయే ట్రైలర్ తో ఈ విషయం పై అందరికీ ఒక క్లారిటీ వస్తుందట.

    అయితే ఈ సినిమాకి శంకర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే ప్రశ్న మీ అందరిలో ఉండడం సహజమే. అందరూ అనుకుంటున్నట్టు ఆయన 50 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఈ సినిమాకి అందుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు ఆయన నిర్మాత దిల్ రాజు నుండి ఒక్క పైసా కూడా తీసుకోలేదు. సినిమా విడుదలైన తర్వాత లాభాల్లో 30 శాతం తీసుకుంటానని చెప్పాడట. అంటే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తే, అందులో 300 కోట్ల రూపాయిలు శంకర్ కి వెళ్తుంది. అలా కాకుండా సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యి కేవలం 300 కోట్ల రూపాయిల లోపు గ్రాస్ ని రాబడితే, అప్పుడు ఆయన రెమ్యూనరేషన్ వంద కోట్ల రూపాయిల కంటే చాలా తక్కువ ఉంటుంది. ఏదైతే అది జరిగింది అని రిస్క్ తీసుకొని, ఒక ఛాలెంజ్ గా ఈ చిత్రాన్ని చేసాడట శంకర్, మరి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.