https://oktelugu.com/

Director Sai Rajesh: వైష్ణవి తండ్రికి చెప్పే బెడ్ రూమ్ సన్నివేశం తీశాను… బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

సినిమాలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి కి అన్ని వర్గాల నుంచి మంచి అప్లాజ్ వస్తుంది. సినిమా ఘన విజయం సాధించడంలో ఆమె పాత్ర ముఖ్యమైంది. తాజాగా దీనిపై దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ, ఈ సినిమా కథ చెప్పగానే ముందుగా వైష్ణవి అంగీకరించలేదు. తన పాత్ర గురించి మరింత క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఒప్పుకుంది అన్నారు. ఎందుకంటే ఇందులో కొన్ని సన్నివేశాల్లో ఆమె బోల్డ్ గా నటించిన విషయం తెలిసిందే, ఆ సన్నివేశాలపై కూడా దర్శకుడు ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా ఉంది.

Written By:
  • Shiva
  • , Updated On : July 26, 2023 / 10:49 AM IST

    Director Sai Rajesh

    Follow us on

    Director Sai Rajesh: చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బేబీ సినిమా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. కథలో సత్తా ఉంటే స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ తో అవకాశం లేదని నిరూపించిన సినిమా బేబీ. కంటెంట్ బాగుంటే దాని ప్రచార బాధ్యతలు కూడా ప్రేక్షకులే తీసుకుంటారు అని చెప్పడానికి బేబీ ఒక ఉదాహరణ. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ సినిమా ఈ రేంజ్ కు చేరుకుంది. కేవలం విడుదలైన 10 రోజుల్లోనే దాదాపు 70 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా పోటీ లేకపోతే మాత్రం 100 కోట్లు దరిదాపుల్లోకి వెళ్తుందని చెప్పవచ్చు.

    ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి కి అన్ని వర్గాల నుంచి మంచి అప్లాజ్ వస్తుంది. సినిమా ఘన విజయం సాధించడంలో ఆమె పాత్ర ముఖ్యమైంది. తాజాగా దీనిపై దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ, ఈ సినిమా కథ చెప్పగానే ముందుగా వైష్ణవి అంగీకరించలేదు. తన పాత్ర గురించి మరింత క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఒప్పుకుంది అన్నారు. ఎందుకంటే ఇందులో కొన్ని సన్నివేశాల్లో ఆమె బోల్డ్ గా నటించిన విషయం తెలిసిందే, ఆ సన్నివేశాలపై కూడా దర్శకుడు ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా ఉంది.

    ఇందులో బెడ్ రూమ్ సన్నివేశాల గురించి వైష్ణవి వాళ్ళ నాన్న గారికి ముందుగా చెప్పి అనుమతి తీసుకోని వాటిని షూట్ చేశాము. ఒక వేళ ఈ సినిమా వలన వైష్ణవి కెరీర్ కి ఏదైనా ప్రమాదం ఏర్పడితే తాను ఇబ్బంది పడకుండా ఉండటానికి ముందు గానే మూడు సినిమాల ఆఫర్స్ ఆమెకు ఇచ్చాము. SKN , మారుతి టాకీస్, అలాగే బన్నీ వాసు యొక్క సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి, ఆమెను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు.

    ఇక ఈ సినిమా చూసిన అందరూ కూడా మరో సాయిపల్లవి దొరికిందని చెప్పడం చాలా సంతోషంగా ఉందని, వైష్ణవి లో ఓ విధమైన హాంగర్ ఉంటుంది. ఏదైనా సన్నివేశం సరిగ్గా రాలేదని అనిపిస్తే ఫోన్ చేసి మరి రేపు దానిని మళ్ళీ రీషూట్ చేద్దామని అడిగేది అంటూ చెప్పుకొచ్చాడు సాయి రాజేష్. గతంలో హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలు చేసిన ఈ దర్శకుడి నుండి బేబీ లాంటి సినిమా రావటంతో టాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ దూసుకెళ్తుంది.