https://oktelugu.com/

Ram Gopal Varma: అన్నిట్లో వేలు పెడుతున్న ఆర్జీవి… చంద్రబాబుపై సెటైర్లు

Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అంటే టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రిలో శివ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీతో తన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. పబ్లిసిటీ విషయంలో ఆయనకు మించిన వారు ఇంకొకరు లేరు అంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఏదో ఒక విషయంపై […]

Written By: , Updated On : November 19, 2021 / 07:01 PM IST
Follow us on

Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అంటే టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రిలో శివ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీతో తన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. పబ్లిసిటీ విషయంలో ఆయనకు మించిన వారు ఇంకొకరు లేరు అంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో ఉండే ఆర్జీవి… రాజకీయ నాయకులు, సినీ తారలపై కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఏదో ఓ విషయంపై ఏదో ఒక ట్వీట్ చేస్తూ… వివాదాలకు తెర లేపుతున్నారు ఈ వివాదాస్పద దర్శకుడు. కాగా దేశంలో, రాష్ట్రంలో ఏది జరిగినా దానిపై నిర్మోహమాటంగా స్పందించే వర్మ తాజాగా ఏపీ రాజకీయాలపై కూడా స్పందించారు.

director ram gopal varma setairical tweet on tdp leader chandra babu nayudu

అయితే తాజాగా ఇవాళ చంద్రబాబు ఏడ్చిన సంఘటనపై తన స్టైల్లో రామ్ గోపాల్ వర్మ వ్యక్తపరిచారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. తన ఆర్జీవి మిస్సింగ్ ట్రైలర్ చూసి… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బోరున ఏడ్చారు అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కాగా ఈరోజు ఆర్జీవి మిస్సింగ్ ట్రెయిలర్ ను విడుదల చేసిన వర్మ… చంద్రబాబు ఏడ్చిన వీడియోను ఎడిట్ చేసి మూవీ ప్రమోషన్ లో వాడేశారు. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ ఇదేం వాడకం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు టి‌డి‌పి నేతలు, అభిమానులు వర్మపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.