https://oktelugu.com/

Tollywood: బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా… కొత్త చిత్రం ప్రారంభం

Tollywood: టాలీవుడ్ స్టార్ కమెడియన్‌ బ్రహ్మానందం నట వారసుడ్ని రంగంలోకి దింపి చాలా ఏళ్లైంది. 2004 లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాతో తన కొడుకు రాజా గౌతమ్‌ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు బ్రహ్మీ. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుచిత్ర చంద్రబోస్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యిందే తప్ప.. కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఆ తరువాత లాంగ్ గ్యాప్ తరువాత ‘వారెవా’, ‘మను’ చిత్రాల్లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 07:21 PM IST
    Follow us on

    Tollywood: టాలీవుడ్ స్టార్ కమెడియన్‌ బ్రహ్మానందం నట వారసుడ్ని రంగంలోకి దింపి చాలా ఏళ్లైంది. 2004 లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాతో తన కొడుకు రాజా గౌతమ్‌ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు బ్రహ్మీ. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుచిత్ర చంద్రబోస్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యిందే తప్ప.. కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఆ తరువాత లాంగ్ గ్యాప్ తరువాత ‘వారెవా’, ‘మను’ చిత్రాల్లో నటించాడు రాజా గౌతమ్. ఈ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించేలేకపోయింది.  మను చిత్రం కలెక్షన్ల పరంగా ఎక్కువ రాబట్టకపోయిన ప్రేక్షకుల మన్ననలను పొందగలిగింది.

    ఈ సినిమాలో గౌతమ్ సరసన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో వీరిద్దరు తమ పాత్రలకు ప్రాణం పోసారని చెప్పాలి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత గౌతమ్ సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చేశారు. అయితే తాజాగా గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. సుబ్బు చెరుకూరి దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు.

    మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్‌క‌మింగ్‌ రచయిత తన జీవితానికి ప్రమాదం ఏర్పడినప్పుడు వాటిని ఎలా అధిగమించి బయటపడ్డాడు అనే కథాంశంతో సినిమా రూపుదిద్దుకుంటోంది. శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోష్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యస్ ఒరిజినల్స్ లో దర్శకుడిగా పరిచయం కాబోతున్న విశ్వ ఈ సినిమాకు ముహూర్త‌పు క్లాప్‌నిచ్చారు.