https://oktelugu.com/

ఇస్మార్ట్ హీరో తో రాజ‌మౌళి చిత్రం..?

‘రాజమౌళి’ సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో 11 చిత్రాలను డైరెక్ట్ చేయ‌గా… ప్ర‌తీ సినిమా విజ‌య‌ఢంకా మ్రోగించింది. ప్ర‌స్తుతం ఈ స్టార్ డైరెక్ట‌ర్.. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో `ఆర్ ఆర్ ఆర్`ని తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2021 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. `ఆర్ ఆర్ ఆర్` […]

Written By:
  • admin
  • , Updated On : March 18, 2020 / 02:13 PM IST
    Follow us on

    ‘రాజమౌళి’ సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో 11 చిత్రాలను డైరెక్ట్ చేయ‌గా… ప్ర‌తీ సినిమా విజ‌య‌ఢంకా మ్రోగించింది. ప్ర‌స్తుతం ఈ స్టార్ డైరెక్ట‌ర్.. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో `ఆర్ ఆర్ ఆర్`ని తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2021
    సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    `ఆర్ ఆర్ ఆర్` త‌రువాత రాజ‌మౌళి చేయ‌బోయే చిత్రంపై ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ లో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. `ఇస్మార్ట్` హీరో రామ్ తో జ‌క్క‌న్న నెక్స్ట్ వెంచ‌ర్ ఉంటుంద‌ని స‌మాచారం. ప‌రిమిత బ‌డ్జెట్ లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తిచేసి 2021లోనే రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నాడ‌ట రాజ‌మౌళి. ఏదేమైనా, రామ్ – రాజ‌మౌళి కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.