సుప్రీంకోర్టు లో జగన్ కి చుక్కెదురు!

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల వాయిదా పై జరుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. ఎన్నికల నిర్వహణ అనేది పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొంది. […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 2:04 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల వాయిదా పై జరుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. ఎన్నికల నిర్వహణ అనేది పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొంది.

అయితే కరోనావైరస్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కు 4 వారాల ముందు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది.

ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను కొనసాగించడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని, కానీ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది.

కరోనావైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌ లో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.. ఈ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం జగన్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనా సాకుతో ఎన్నిక‌లు వాయిదా వేయ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సరిగ్గా ఇక్కడే ఆంధ్రప్రదేశ్‌ లో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార పరిధిపై వివాదం మొదలైంది.

మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. వెంటనే వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రపున ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా ఎస్‌ఈసీకి లేఖ రాశారు. ఈ ప‌రిణామాల‌ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను పిలిచి గవర్నర్ వివరణ తీసుకున్నారు.