RRR Movie: బాహుబలి వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ” ఆర్‌ఆర్‌ఆర్ “. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి ఈ సినిమాలో నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నాడు.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. నార్త్ నుంచి సౌత్ వరకు ఆ సినిమా ప్రమోషన్లు హోరెత్తుతున్నాయి. అందులో భాగంగా సినిమాకి “ఆర్‌ఆర్‌ఆర్” అనే టైటిల్ ఎందుకు పెట్టారన్న దానిపై దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాకి మొదట్లో ఏ టైటిల్ పెట్టాలో అర్ధం కాలేదని రాజమౌళి అన్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి పేర్లు కలిసోచ్చేలా ఈ ప్రాజెక్ట్ ని ఆర్‌ఆర్‌ఆర్ అని పిలవాలను కున్నామని తెలిపారు.
Also Read: “పుష్ప” సినిమా డెలీటెడ్ సీన్… అల్లు అర్జున్ ఏం చేశాడంటే ?
ఈ మేరకు అందుకే ముందు నుంచి కూడా ఆర్‌ఆర్‌ఆర్ హ్యాష్ ట్యాగ్‌తోనే ఈ సినిమా అప్‌డేట్స్ ఇచ్చామని చెప్పారు. ఆ తర్వాతే ఈ సినిమాకు తెలుగుతో పాటు హిందీ ఇతర భాషల నుంచి సైతం టైటిల్ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. మనదేశ సంస్కృతి తోపాటు విప్లవం – భావోద్వేగం సమ్మేళనమే త్రిబుల్ ఆర్ సినిమా అని రాజమౌళి చెప్పారు. ఈ సినిమాకు ఇతర రాష్ట్రాలకు చెందిన టెక్నీషియన్లు ఎక్కువగా పని చేశారని… సినిమాలో టెక్నికల్ వ్యాల్యూస్ కూడా అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Also Read: ఆ డైరెక్టర్ ను బూతులు తిట్టేసిన సమంత !