https://oktelugu.com/

Director Rajamouli: మాకొద్దయ్యో నీ మహాభారతం… టాలీవుడ్ స్టార్స్ ని భయపెట్టిన రాజమౌళి!

మహాభారతంలో నటించే నటులు ఏకంగా 20 ఏళ్ళు కాల్షీట్స్ రాజమౌళికి ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో స్థలాన్నో, బిల్డింగునో లీజుకు తీసుకున్నట్లు రాజమౌళి సుదీర్ఘ కాలం నటులను లాక్ చేస్తారన్న మాట. ప్రధాన పాత్రలు చేసిన నటులు ఈ పీరియడ్ లో ఇతర చిత్రాలు చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఒక వేళ అవకాశం ఉన్నా గెటప్ వేరియేషన్స్ కుదరకపోవచ్చు. సపోజ్ భీముడు పాత్ర అంటే భారీ కాయం కలిగి ఉండాలి. ఆ పాత్ర చేసే నటుడు పది పార్ట్స్ లో సేమ్ ఫిజిక్ కలిగి ఉండాలి.

Written By:
  • Shiva
  • , Updated On : May 12, 2023 / 05:03 PM IST

    Director Rajamouli

    Follow us on

    Director Rajamouli: ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఏడాదికి 10 నుండి 20 సినిమాలు చేసేవారు. ఆ నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఐదు నుండి పది చిత్రాలు చేసేవాళ్ళు. వాళ్ళు కూడా మెల్లగా తగ్గించుకుంటూ వచ్చారు. ఏడాదికి రెండు మూడు సినిమాలకు పరిమితమయ్యారు. ఇక ఈ జనరేషన్ స్టార్స్ ఏడాదికి ఒకటి చేయడం కూడా గగనమైపోయింది.ఇక రాజమౌళితో సినిమా అంటే ఈజీగా ఓ ఐదేళ్లు కేటాయించాల్సిన పరిస్థితి. బాహుబలి వన్ అండ్ టు చిత్రాల కోసం ప్రభాస్ ఏకంగా నాలుగేళ్లు కేటాయించారు. 2013లో మిర్చి విడుదలైంది. 2015లో బాహుబలి పార్ట్ 1, 2017లో బాహుబలి పార్ట్ 2 రిలీజ్ చేశారు.

    జక్కన్న దెబ్బకు ప్రభాస్ మరింత లేజీగా తయారయ్యాడు. కనీసం రెండేళ్లు గ్యాప్ లేనిదే మూవీ విడుదల చేయడం లేదు. బాహుబలి 2, సాహూ, రాధే శ్యామ్ చిత్రాల విడుదల మధ్య రెండేళ్లకు పైగా గ్యాప్ ఉంది. రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ కి కమిటై నాలుగేళ్లు వదులుకున్నాడు ఎన్టీఆర్. 2018లో అరవింద సమేత వీరరాఘవ మూవీ చేసిన ఎన్టీఆర్ 2022లో ఆర్ ఆర్ ఆర్ తో పలకరించారు. మరో రెండేళ్లకు 2024లో కొరటాల మూవీ విడుదల చేయనున్నాడు. భారీ చిత్రాలతో ఫేమ్ వస్తున్నా ఇంతటి నిరీక్షణ మా వల్ల కాదని ఫ్యాన్స్ వాపోతున్నారు.

    ఈ క్రమంలో మంచి చిత్రాలు చేస్తూనే వేగంగా కూడా ఉండాలని భావిస్తున్నారు. అయితే వారి గుండెల్లో రాజమౌళి బాంబు పేల్చాడు. ఆయన తాజా ప్రకటన టాప్ స్టార్స్ మైండ్ బ్లాక్ చేసింది. రాజమౌళి సినిమా ఆఫర్ అంటే ఎగిరి కాటేసే బదులు… అమ్మో మా వల్ల కాదని ఫీలవుతున్నారు. మహాభారతం రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం తెలిసిందే. దీన్ని ఆయన పది భాగాలుగా 20 ఏళ్లు తీయాలని డిసైడ్ అయ్యాడట. ఆ విధంగా మహాభారతం ప్రాజెక్ట్ ని అంచనా వేశాడట.

    అంటే మహాభారతంలో నటించే నటులు ఏకంగా 20 ఏళ్ళు కాల్షీట్స్ రాజమౌళికి ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో స్థలాన్నో, బిల్డింగునో లీజుకు తీసుకున్నట్లు రాజమౌళి సుదీర్ఘ కాలం నటులను లాక్ చేస్తారన్న మాట. ప్రధాన పాత్రలు చేసిన నటులు ఈ పీరియడ్ లో ఇతర చిత్రాలు చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఒక వేళ అవకాశం ఉన్నా గెటప్ వేరియేషన్స్ కుదరకపోవచ్చు. సపోజ్ భీముడు పాత్ర అంటే భారీ కాయం కలిగి ఉండాలి. ఆ పాత్ర చేసే నటుడు పది పార్ట్స్ లో సేమ్ ఫిజిక్ కలిగి ఉండాలి. ఇరవై ఏళ్ళ పాటు ఒకేలా ఉండటం సాధ్యమేనా…

    ఒక పార్ట్ లో నటించిన నటుడు మిగతా పార్ట్స్ లో నటించాలనే నియమం లేకపోయినా నటులు రాజమౌళితో అన్నేళ్లు ట్రావెల్ చేయడం కష్టం. మరొక విషయం ఏమిటంటే ఇప్పటి స్టార్స్ అందరూ 40 ప్లస్ లో ఉన్నారు. కొందరు నలభైకి దగ్గరయ్యారు. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఇంకో పదేళ్ల తర్వాతే. అప్పటికి అందరూ 50 ప్లస్ లోకి వెళతారు. అక్కడ నుండి 20 ఏళ్ళు అంటే వాళ్ళ వయసు 60-70 ఏళ్లకు చేరుతుంది. ఇవ్వన్నీ పరిగణలోకి తీసుకున్న టాలీవుడ్ స్టార్స్ మాకొద్దయ్యో నీ మహాభారతం అంటున్నారు. కాబట్టి రాజమౌళి మహాభారతంలో బహుశా ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వారసులు నటించవచ్చు…