Director Rajamouli: దర్శకధీరుడిగా తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఆయన చేసిన సినిమాలు తనకి పాన్ ఇండియాలో భారీ గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో ఉన్న దర్శకులను సైతం ఆకర్షించి అక్కడున్న ప్రేక్షకులతో శభాష్ అనిపించుకునేలా ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట రాజమౌళి చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక రాజమౌళి సినిమాలోని సీన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూనే ఎలివేషన్స్ ను కూడా బాగా హ్యాండిల్ చేస్తు ఉంటాడు. అందుకే ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి ప్రతి సినిమాలో మ్యూజిక్ అనేది చాలా హైలెట్ గా నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా కీరవాణి అతని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడం విశేషం… ప్రతి సినిమాలోని సాంగ్స్ మ్యూజికల్ గా సూపర్ సక్సెస్ ని సాధించడంలో కీరవాణి పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. సినిమాల సక్సెస్ కి మ్యూజిక్ కూడా చాలా వరకు హెల్ప్ అయింది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా కీరవాణి స్పెషల్ కేర్ తీసుకుంటాడు.
Also Read: బాలయ్య తో హీరోయిన్ గా చేసి ఆయనకే తల్లి నటించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఇతరుల సినిమాని పక్కన పెడితే రాజమౌళి సినిమా అనేసరికి ఆయన చాలా క్వాలిటీగా వర్క్ చేస్తూ ఉంటాడు… మరి ఇలాంటి క్రమంలోనే రాజమౌళి ఎందుకని కీరవాణి నే తన సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటున్నాడు అనే విషయం మీద చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ విషయాన్ని ఒకసారి రాజమౌళిని అడగగా తనకు మ్యూజిక్ మీద అంత పెద్దగా నాలెడ్జ్ లేదని అయితే ఎలాంటి మ్యూజిక్ కావాలో మొత్తం కీరవాణి గారే చూసుకుంటారు. కాబట్టి ఆ బాధ్యత మొత్తాన్ని తనకే అప్పచెబుతానని అందువల్లే నేను ఆయన్ని తీసుకుంటాను అని చెప్పాడు.
ఇక వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయితే నేను అంత కంఫర్ట్ గా పనిచేయలేనని ఆయన చెప్పడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి – కీరవాణి ఇద్దరు బ్రదర్స్ కావడం వల్ల వీళ్ళ మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది… ఇక దాంతోనే మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు…