Director Mohan Raja On Prabhas: బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని అభిమానులను తెచ్చి పెట్టుకున్నారు మన హీరో ప్రభాస్. ఇక అప్పటినుంచి మన డార్లింగ్ రేంజ్ మారిపోయింది. ఏ హీరోకి లేనన్ని భారీ బడ్జెట్ సినిమాలు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు బాహుబలి 2 సినిమా తరువాత ప్రభాస్ కి ఒక్క సూపర్ హిట్ కూడా లేదు.
సాహో సినిమా ఏదో యవరేజ్ గా పొగా ఆ తరువాత వచ్చిన రాధే శ్యామ్, ఆది పురుష్ డిజాస్టర్లగా మిగిలాయి. ఈ నేపథ్యంలో ఒక తమిళ దర్శకుడు ప్రభాస్ ఒకప్పుడు ఒక బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నారు అని చెప్పడం ఆయన అభిమానులను మరింత నిరుత్సాహానికి గురిచేస్తొంది.
చిరంజీవితో గాడ్‌ఫాదర్ తీసిన మోహన్‌రాజా తమ్ముడు ఆయన. జయంరవి కెరీర్‌ను నిలబెట్టిన సినిమా తని ఒరువన్.ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా తని ఒరువన్ కథ ప్రభాస్ కోసమే రాసుకున్నానని, అయితే అప్పటికే ఆయన ఓ లవ్ స్టోరీని విని దానికి కమిట్ అయిపోయాడని చెప్పాడు. దాంతో అదే కథను జయం రవితో తీసి తమిళనాట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు.
అయితే ప్రభాస్ ఆ కథ విన్నది డార్లింగ్ సినిమా టైమ్‌లో. ఇక తని ఒరువన్ వచ్చింది 2015లో. అంటే దాదాపు ఐదారేళ్ల పాటు ఈ సినిమా కథతోనే మోహన్ రాజా ట్రావెల్ అయ్యాడు. నిజానికి అప్పుడు ఈ సినిమా చేయకపోవడమే బెటర్ అయిందని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్‌కు డార్లింగ్ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.
అప్పటివరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌కు కెరీర్‌లో ఎలాంటి సినిమా పడితే సాలిడ్ పాపులారిటీ వస్తుందో అలాంటి సినిమానే డార్లింగ్ రూపంలో ప్రభాస్‌కు వచ్చి పడింది. అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం తని ఒరువన్ చేసుంటే ప్రభాస్ కెరీర్‌లో ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయేదని అంటున్నారు. ఏదేమైనా తని ఒరువన్ కథను మిస్ చేసుకున్నాడంటే బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఇక మోహన్ రాజా చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆ విషయం గురించి తమ బాధని వెల్లదడిస్తున్నారు ప్రభాస్ అభిమానులు.