Director Maruthi: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు మారుతీ కూడా ఒప్పుకున్నాడు. నేడు మూవీ యూనిట్ మొత్తం ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో మారుతీ ఈ వ్యాఖ్యలు చేస్తూ, ప్రభాస్ ఓల్డ్ ఏజ్ గెటప్ ని నేటి ఫస్ట్ షోస్ నుండి జత చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ వంద కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం కచ్చితంగా రాబడుతుందని అనుకున్నాము, కానీ 112 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని చెప్పుకొచ్చాడు. ఇక డైరెక్టర్ మారుతీ మాట్లాడిన మాటలను ఎక్సక్లూసివ్ గా మీ కోసం అందిస్తున్నాము చూడండి.
ఆయన మాట్లాడుతూ ‘ ప్రభాస్ గారి అభిమానులు ‘రాజా సాబ్’ పట్ల పూర్తిగా సంతృప్తి చెందలేదు, ఎందుకంటే మేము ట్రైలర్ లో ప్రభాస్ ని ఓల్డ్ గెటప్ లో చూపించాము,రాక్షసుడు అంటూ ఆయన చూపించిన స్టైల్, యాటిట్యూడ్, స్వాగ్ ఇవన్నీ ఆడియన్స్ ని ట్రైలర్ లో బాగా ఆకట్టుకున్నాయి. ఆ క్యారెక్టర్ కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎదురు చూసారు. అది లేకపోయేసరికి మేము చెప్పిన కథ వాళ్లకు ఎక్కలేదు. ప్రభాస్ అభిమానులు నాకు చాలా మంది ఫోన్ చేశారు. సినిమా చాలా బాగా తీసావు అన్నా, కానీ ఆ ఓల్డ్ గెటప్ సన్నివేశాలు లేకపోవడం మమ్మల్ని బాగా నిరాశకి గురి చేసింది , అది మళ్లీ సినిమాలో యాడ్ చేస్తే మేమంతా సంతోషిస్తామని చెప్పారు. వాళ్ళ రిక్వెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ హాఫ్ ని ఇంకా కొంచెం షార్ప్ చేసి, ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ ని ఈరోజు సాయంత్రం షోస్ నుండి యాడ్ చేయబోతున్నాము’.
‘ఆ ఎపిసోడ్ కచ్చితంగా మీ అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ఈ ఏపీసీఓడీ కోసం చాలా ఖర్చు చేసాము, ప్రభాస్ గారు చాలా కస్టపడి చేసాడు. రూఫ్ మీద పోరాట సన్నివేశం ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ సినిమాలో కూడా చూపించలేదు. దాదాపుగా 8 నిమిషాల ఎపిసోడ్ అది. అదే విధంగా ఈ సినిమాలో ల్యాగ్ అనిపించిన కొన్ని సన్నివేశాలను కూడా తొలగిస్తున్నాము. ఈ ఎడిట్ కచ్చితంగా మీ అందరినీ సంతృప్తి పరుస్తుందని అనుకుంటున్నాను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కొత్త సన్నివేశాల కారణంగా ఈ సినిమాకు వసూళ్లు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.